ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Venkatesan: ఒక్క ఇటుక వేసి ఇన్ని షాక్‌లా..!

ABN, First Publish Date - 2023-09-02T09:19:55+05:30

ఒకే ఒక్క ఇటుక వేసి ఇన్ని షాక్‌లు ఇస్తారా? అంటూ మదురై సీపీఎం ఎంపీ వెంకటేశన్‌(Madurai CPM MP Venkatesan) విమర్శించారు.

- సీపీఎం ఎంపీ వెంకటేశన్ విమర్శ

పెరంబూర్‌(చెన్నై): ఒకే ఒక్క ఇటుక వేసి ఇన్ని షాక్‌లు ఇస్తారా? అంటూ మదురై సీపీఎం ఎంపీ వెంకటేశన్‌(Madurai CPM MP Venkatesan) విమర్శించారు. మదురై ఎయిమ్స్‌ నిర్మాణాలకు సంబంధించి ఇటీవల కేంద్రప్రభుత్వం టెండర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టెండర్‌ కన్నల్టెన్సీకోసం ఆరు సంస్థలను ఎంపిక చేసి, మూడింటిని ఖరారు చేశారు. వాటిలో సేలంకు చెందిన ముఖేష్‌ అసోసియేట్స్‌ అనే సంస్థను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అందుకు ఖరారు చేసిన మూడు సంస్థల్లో ఒకటైన లక్నోకు చెందిన ఆర్చ్‌-ఎన్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ముఖేష్‌ అసోసియేట్స్‌ సంస్థ(Mukesh Associates)పై రూ.1,528 కోట్ల అవినీతి ఆరోపణలున్నాయని, ఈ సంస్థ సీబీఐ వలయంలో ఉందని, ఆ సంస్థ ఎంపికలో తగిన నిబంధనలు పాటించలేదని, అలాగే, టెండర్ల విధానాలు కూడా సులభతరం చేశారని ఆర్చ్‌-ఎన్‌ సంస్థ ఆరోపించింది. అలాగే, ‘హైట్స్‌’ లాంటి అనుభవజ్ఞులైన సంస్థలను నిర్లక్ష్యం చేశారని, సాధారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన సంస్థ ఎంపిక ఆఫ్‌లైన్‌లో ఎలా నిర్వహిస్తారని సదరు సంస్థ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల భాగస్వామ్యాన్ని నిరోధించే ఫీచర్‌ తొలగించారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఎంపీ వెంకటేశన్‌ తన ట్విట్టర్‌లో, ప్రాజెక్ట్‌ కన్సల్టెన్సీ ఎంపికలో అవకతవకల ఆరోపణ? సీబీఐకి చిక్కుకున్న సంస్థకు టెండరు ఆమోదం? ఒకే నెంబరుపై 7.5 లక్షల వైద్య బీమా కార్డులు నమోదుచేసినట్లు, ఒక్క ఇటుకతో ఇంకెన్ని షాక్‌లిస్తారో....: అంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-09-02T09:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising