Parliament: గ్రూపు ఫోటోతో పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు.. ముందు వరుసలో ఎవరెవరంటే..?
ABN, First Publish Date - 2023-09-19T11:44:34+05:30
నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాత భవనం లోపలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఢిల్లీ: నూతన పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాత భవనం లోపలి ప్రాంగణంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వేర్వేరుగా గ్రూఫ్ ఫోటోలకు పోజులిచ్చారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ మొదటి వరుసలో కూర్చున్నారు. మరో ఫోటోలో ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యలో ప్రధాని మోదీ కూర్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర కేబినెట్ మంత్రులు, లోక్‌సభలో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది, రాజ్యసభలో ఐదు అంతకంటే లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల బలం కలిగిన పార్టీల నాయకులు, సీనియర్ సభ్యులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ముందు వరుసలో కూర్చున్నారు. పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమం తర్వాత, కొత్త భవనానికి ప్రొసీడింగ్స్ మారుతాయి. కాగా పార్లమెంట్ నూతన భవనంలో నేడు లోక్‌సభ మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభం కానుండగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభంకానుంది.
Updated Date - 2023-09-19T11:45:59+05:30 IST