మిస్టర్ సోమశేఖర్‌రెడ్డి.. నోరు పారేసుకుంటే ఖబడ్దార్..!
ABN, First Publish Date - 2023-06-04T11:47:25+05:30
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి(Gali Somasekhar Reddy) బళ్లారి నగర ప్రజల సోమ్మును దోచుకున్న దుర్మార్గుడని, ఆయన ఎమ్మెల్యే కాలం
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి(Gali Somasekhar Reddy) బళ్లారి నగర ప్రజల సోమ్మును దోచుకున్న దుర్మార్గుడని, ఆయన ఎమ్మెల్యే కాలంలో ప్రతి పనికీ ప్రజల నుంచి కమీషన్లు పొందారని, అంతేకాకుండా ఆయన చేసిన దుర్మార్గ పనులు బళ్లారి ప్రజలకు బాగా తెలుసని కేఆర్‌పీపీ నాయకులు ఆరోపించారు. శనివారం బళ్లారిలోని గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) నివాసంలో కేఆర్‌పీపీ జిల్లా అధ్యక్షుడు గోనహళ్ రాజశేఖర్ గౌడ, పార్టీ కీలక నాయకులు ఎం. అలీఖాన్, సంజయ్ బెట్కర్, మల్లికార్జున, కొలగల్లు అంజినీ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గాలి జనార్దన్‌రెడ్డిపై గాలి సోమశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. గాలి సోమశేఖర్‌రెడ్డి రెండు నాలుకల దోరణి అవలంబించడం సరైన పద్దతి కాదని, గతంలో జనార్దన్ రెడ్డిని తెలివైన వాడిగా పొగిడారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోనహళ్ రాజశేఖర్ గౌడ మాట్లాడుతూ దక్షిన కర్ణాటకలో బీజేపీ గెలవడానికి ప్రధానంగా గాలి జనార్దన్‌రెడ్డి కృషి ఉందన్నారు. ఈరోజు గాలి సోమశేఖర్‌రెడ్డి రాజకీయంగా ఇంత ఎదిగినారంటే అది కేవలం గాలి జనార్దన్‌రెడ్డి కారణంగానే అన్నారు. 2013 ఎన్నికల్లో బీఎస్ఆర్ పార్టీ ఏర్పడినప్పుడు కూడా గాలి సోమశేఖర్‌రెడ్డి ఆయన స్వార్థ రాజకీయాలకు మురళీ అనే వ్యక్తిని బలి చేశారన్నారు. 2021లో జరిగిన నగర పాలికె ఎన్నికల్లో కనీసం నీ కొడుకును కూడా కార్పొరేటర్‌గా గెలిపించుకోలేక పోయావు అని అరోపించారు.
అలీఖాన్ మాట్లాడుతూ గాలి కుటుంబాన్ని నాశనం చేసేకి సోమశేఖర్‌రెడ్డి శకునిలా తయారయ్యారన్నారు. గాలి జనార్దన్‌రెడ్డితో పేద ప్రజలకు ఇళ్లు ఇస్తామని చెప్పి 32 ఎకరాల భూమికి డబ్బులు తీసుకుని సొంతంగా వాడుకున్నారని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో బళ్లారి(Bellary0 జిల్లాలోని 5 తాలూకాల్లో ప్రతి తాలూకాలోనూ కేఆర్‌పీపీ(KRPP) పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని పేర్కొన్నారు. గాలి సోమశేఖర్‌రెడ్డి ఆయన భార్య కలిసి ఇక్కడ ఎవరిని హత్య చేశారో అందరికీ తెలుసని చెప్పారు. కానీ వాటిని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని పేర్కొన్నారు. కల్యాణ కర్ణాటక జిల్లాలో పార్టీ బలోపేతంకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. సంజయ్ బెట్కరీ మాట్లాడుతు గతంలో మాదిరే ఈ ఏడాది జూలై 25 న ఉచిత సామూహిక వివాహాలు బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్‌రెడ్డి కేఆర్‌పీపీ తరుపున నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2023-06-04T11:47:25+05:30 IST