ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mumbai:ముంబయిలో ఘోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఢిల్లీ కంటే అధ్వానంగా పరిస్థితి

ABN, First Publish Date - 2023-10-18T12:06:42+05:30

వాయు నాణ్యత ఇండెక్స్(Air Quality Index) లో ఇన్నాళ్లు ఢిల్లీ మీదున్న ఓ రికార్డు ఇప్పుడు ముంబయి బ్రేక్ చేసింది. ముంబయిలో దేశ రాజధానికంటే అధ్వానమైన పరిస్థితి నెలకొందరి ఓ రిసర్చ్ వెల్లడించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం.. ముంబయి(Mumbai)లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీకి పడిపోయింది.

ముంబయి: వాయు నాణ్యత ఇండెక్స్(Air Quality Index) లో ఇన్నాళ్లు ఢిల్లీ మీదున్న ఓ రికార్డు ఇప్పుడు ముంబయి బ్రేక్ చేసింది. ముంబయిలో దేశ రాజధానికంటే అధ్వానమైన పరిస్థితి నెలకొందరి ఓ రిసర్చ్ వెల్లడించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం.. ముంబయి(Mumbai)లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీకి పడిపోయింది. వాయు నాణ్యతలో ఇది ఢిల్లీ(Delhi) కంటే అధ్వానమైన పరిస్థితి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 83లో ఉండగా.. ముంబయి 119వస్థానంలో ఉంది. నగరంలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్రాంతంలో వాయు నాణ్యత మరింత ఘోరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.


దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి క‌ృషి చేయాలని కోరింది. ఇవాళ దక్షిణ ముంబయి పొగమంచులో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'హలో ఢిల్లీ.. ఓహ్ వెయిట్, ముంబయి!#స్మోక్' అని క్యాప్షన్ పెట్టాడు. మంగళవారం అంధేరి, మజ్ గావ్, నవీ ముంబయితో సహా చాలా ప్రాంతాలు పూర్ ఎయిర్ క్వాలిటీని ప్రదర్శించాయి. పశ్చిమ కనుమల నుండి వీస్తున్న చల్లని గాలులు తీరం వెంబడి వెచ్చని గాలిని తాకడం వల్ల ఈ పొల్యూషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CBCB) చేసిన అధ్యయనంలో ఇండియాలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ తరువాతి స్థానాల్లో ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, మీరట్ నిలిచాయి. బిహార్‌లోని పట్నా, ముజఫర్‌పూర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. బుధవారం 'సంతృప్తికరమైన' గాలి నాణ్యత కేటగిరీలో దేశ రాజధాని ఉంది.

Updated Date - 2023-10-18T12:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising