ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Baheswar Dham : ధీరేంద్ర శాస్త్రికి ముస్లిం మత పెద్దల షాక్

ABN, First Publish Date - 2023-02-19T10:45:55+05:30

బాగేశ్వర్ ధామ్ (Baheswar Dham) చీఫ్ ధీరేంద్ర శాస్త్రి (Dhirendra Shastri) నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ముస్లింలను ఆ మత

Dhirendra Shastri
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా : బాగేశ్వర్ ధామ్ (Baheswar Dham) చీఫ్ ధీరేంద్ర శాస్త్రి (Dhirendra Shastri) నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ముస్లింలను ఆ మత పెద్దలు ఆదేశించారు. దేశాన్ని ముక్కలు చేయడం, హిందూ దేశం ఏర్పాటు గురించి శాస్త్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముస్లింలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

మధ్య ప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా, గడ గ్రామంలోని హనుమాన్ దేవాలయం బాగేశ్వర్ ధామ్ చీఫ్‌గా ధీరేంద్ర శాస్త్రి వ్యవహరిస్తున్నారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించగలనని చెప్తున్నారు. దీంతో వందలాది మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వెళ్తున్నారు.

ఆగ్రా మసీదు మేనేజర్ మహమ్మద్ షరీఫ్ కాలా మాట్లాడుతూ, ధీరేంద్ర శాస్త్రి దేశాన్ని ముక్కలు చేయడం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయనకు దూరంగా ఉండాలని ముస్లింలను కోరామన్నారు. సనాతన ధర్మమే గొప్పదని ఆయన మాట్లాడుతున్నారని, తద్వారా హిందూ దేశం ఏర్పాటు గురించి చెప్తున్నారని, ముస్లింలను అవమానిస్తున్నారని అన్నారు.

మహమ్మద్ షరీఫ్ కాలాను భారతీయ ముస్లిం వికాస్ పరిషత్ కూడా సమర్థించింది. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాస్త్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా, ధీరేంద్ర శాస్త్రి శనివారం మాట్లాడుతూ, భారత దేశం త్వరలోనే హిందూ దేశం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హిందుత్వం గురించి గర్వంగా చెప్పుకునేవారు ఉండే దేశంగా భారత దేశాన్ని చూడాలని విదేశీయులు కూడా కోరుకుంటున్నారన్నారు. ‘‘నేటి కార్యక్రమంలో విదేశీయులు కూడా ఉన్నారు. వారు క్రైస్తవాన్ని ఆచరిస్తున్నప్పటికీ, సనాతన ధర్మం పట్ల విశ్వాసం కలిగియున్నారు. అన్ని కులాల విభేదాలను పక్కనబెట్టి హిందుత్వం గురించి గర్వంగా చెప్పుకునేవారు ఉండే భారత దేశాన్ని వారు కూడా కోరుకుంటున్నారు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Delhi liquor policy : సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ

East Godavari: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ అప్రమత్తం

Updated Date - 2023-02-19T10:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising