ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muslim World : భారత్‌లో ఐక్యత ఆదర్శప్రాయం : ముస్లిం వరల్డ్ లీగ్

ABN, First Publish Date - 2023-07-11T16:03:35+05:30

భారత దేశ ఐక్యతను, ముస్లింలను ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారన్నారు. తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశ ఐక్యతను, ముస్లింలను ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారన్నారు. తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మానవాళికి భారత దేశం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. భారతీయుల విజ్ఞానం గురించి తాము చాలా విన్నామని చెప్పారు. కలిసికట్టుగా శాంతియుతంగా జీవించాలనే ఉమ్మడి లక్ష్యం మనకు ఉందన్నారు. భారత దేశంలోని వైవిద్ధ్యభరితమైన అంశాలు సహజీవనానికి గొప్ప నమూనా అని తెలిపారు. ఇది కేవలం మాటల్లో మాత్రమే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా ఆదర్శప్రాయమైనదేనని చెప్పారు. ఈ విషయంలో జరుగుతున్న కృషిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.

డాక్టర్ అల్-ఇస్సాను ఉద్దేశించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ, ‘‘మీకు ఇస్లాంతోపాటు ప్రపంచంలోని ఇతర మతాల గురించి లోతైన అవగాహన ఉంది. వేర్వేరు మతస్థుల మధ్య సామరస్యం కోసం కృషి చేస్తున్నారు. సంస్కరణల పథంలో నడవడానికి నిరంతరం ధైర్యంతో కృషి చేస్తున్నారు. ఇస్లాం గురించి, మానవాళికి అది చేస్తున్న కృషి గురించి మరింత బాగా అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. అంతేకాకుండా అతివాద, రాడికల్ భావజాలాలు యువత మనసుల్లో వ్యాపించకుండా నిరోధించాయి’’ అని తెలిపారు.

మతం, స్థానికత, సంస్కృతి వంటివాటితో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ వేదికను కల్పించడంలో భారత దేశం విజయవంతమైందని అజిత్ దోవల్ చెప్పారు. ముస్లింలు అధికంగాగల దేశాల్లో ప్రపంచంలో రెండో స్థానంలో భారత దేశం నిలిచిందని, భారత దేశంలో ఇస్లాం సగర్వంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందన్నారు. ఇస్లామిక్ సహకార సంఘంలోని 33 దేశాల్లోని ముస్లింల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో భారత దేశంలో ముస్లింలు ఉన్నారని చెప్పారు. ప్రపంచంలోని విభిన్న అభిప్రాయాలు, సిద్ధాంతాలను స్వాగతించడంలో అరమరికలు లేకపోవడం, వేర్వేరు సిద్ధాంతాలుగలవారితో చర్చలు జరపడం, వివిధ నమ్మకాలు, ఆచారాలు, సంస్కృతులను పూర్తిగా అర్థం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న అన్ని మతాలవారికి అభయాన్నిచ్చే దేశంగా భారత దేశం ఎదిగిందని తెలిపారు.

డాక్టర్ అల్-ఇస్సా మన దేశంలో ఆరు రోజులపాటు పర్యటిస్తారు. ఈ పర్యటన సోమవారం ప్రారంభమైంది. భారత దేశంలోని రాజకీయ, మతపరమైన నాయకత్వాన్ని ఇస్లామిక్ వరల్డ్ సంస్థతో అనుసంధానం చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంచడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సంస్థకు సౌదీ అరేబియా నిధులు సమకూర్చుతోంది. అందువల్ల ఆయన పర్యటనను ‘శాంతి దౌత్యం’గా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Heavy Rains : ఉప్పొంగుతున్న యమున.. హిమాచల్ ప్రదేశ్‌కు వరద హెచ్చరిక..

India Vs America : అమెరికాను వెనుకకు నెట్టబోతున్న భారత్ : గోల్డ్‌మన్ శాచెస్

Updated Date - 2023-07-11T16:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising