Nandini: ‘నందిని’ ని నాశనం చేసేందుకు కుట్ర..
ABN, First Publish Date - 2023-04-13T14:10:24+05:30
కన్నడిగులు ఎంతో కష్టపడి రూపొందించిన కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) బ్రాండ్ నందినిని నాశనం చేసేందుకు కుట్ర
చింతామణి(బెంగళూరు): కన్నడిగులు ఎంతో కష్టపడి రూపొందించిన కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) బ్రాండ్ నందినిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కర్ణాకట రక్షణ వేదిక (కరవే) ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌ను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా నందిని ప్రాధాన్యతను తగ్గి స్తున్నారని కరవే జిల్లా అధ్యక్షుడు ఎంఆర్ లోకేశ్ ఆరోపించారు. నందిని బ్రాండ్‌ను అమూల్‌లో విలీనం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. పట్టణంలో తాలూకా కార్యాలయం వద్ద బుధవారం కరవే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అమూల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దారు ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ లక్షలాదిమంది పాడిరైతులకు అండగా ఉన్న నందినికి భంగం వాటిల్లితే సహించేది లేదన్నారు. ధర్నాలో కరవే తాలూకా అధ్యక్షుడు నారాయణస్వామి, పట్టణ అధ్య క్షుడు షబ్బీర్ అహ్మద్, పదాధికారులు విజికుమార్, కెంపరెడ్డి, చొక్కహళ్ళి దేవ రాజ్, ప్రభావతి, రత్నమ్మ, మంజమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-13T14:10:24+05:30 IST