LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పెరిగిందోచ్.. డిసెంబర్ 1వ తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..!
ABN, First Publish Date - 2023-12-01T09:56:42+05:30
LPG Cylinder: నెల ఒకటో తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటిలానే ఈసారి కూడా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరను పెంచేశాయి.
LPG Cylinder: నెల ఒకటో తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటిలానే ఈసారి కూడా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరను పెంచేశాయి. ధరల పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.21 పెరిగింది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఇవాళ పెరిగిన రూ.21తో కలుపుకుని ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ.1,797.50కి చేరింది. కాగా, ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2కిలోలు) ధర రూ.903గా ఉంది. గత నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.103 పెంచిన సంగతి తెలిసిందే. ఈ పెరుగుదలతో రెస్టారెంట్, స్వీట్ షాప్స్, హోటళ్ల యజమానులు, బేకర్లు బెంబెలెత్తిపోతున్నారు. కాగా, ప్రస్తుతం దేశంలోని ముఖ్యమైన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!
* రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1796.50కి పెరిగింది. నవంబర్‌లో ఈ ధర రూ.1775.50గా ఉంది.
* కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,908 కాగా, నవంబర్‌లో వాటి ధర రూ.1,885.50.
* ఆర్థిక రాజధాని ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర గత నెలలో రూ.1,728గా ఉంటే, ఇప్పుడది రూ.1,749కి చేరింది.
* చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,968.50 కాగా ఆగస్టులో దాని ధర రూ. 1,942.
* హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2002 కాగా, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 955.
NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!
Updated Date - 2023-12-01T09:56:43+05:30 IST