MotoGP: కశ్మీర్, లద్దాఖ్ లేకుండా భారత్ మ్యాప్.. సారీ చెప్పిన మోటో జీపీ
ABN, First Publish Date - 2023-09-22T19:18:13+05:30
ప్రముఖ మోటార్ రేసింగ్ బైక్ మోటోజీపీ(MotoGP) భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించడం విమర్శలకు కారణమైంది. అంతర్జాతీయ మోటార్ బైక్ రేసింగ్(Bike Racing) మోటోజీపీ తొలిసారిగా భారత్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం భారత్ కి సంబంధించిన ఓ మ్యాప్ ని కంపెనీ ప్రదర్శించింది. అందులో కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్(Jammu Kashmir), లద్దాఖ్(Laddak) లు లేకుండా మ్యాప్ ని ప్రదర్శించింది.
ప్రముఖ మోటార్ రేసింగ్ బైక్ మోటోజీపీ(MotoGP) భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించడం విమర్శలకు కారణమైంది. అంతర్జాతీయ మోటార్ బైక్ రేసింగ్(Bike Racing) మోటోజీపీ తొలిసారిగా భారత్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం భారత్ కి సంబంధించిన ఓ మ్యాప్ ని కంపెనీ ప్రదర్శించింది. అందులో కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్(Jammu Kashmir), లద్దాఖ్(Laddak) లు లేకుండా మ్యాప్ ని ప్రదర్శించింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు(Netigens) ఘాటు విమర్శలు చేశారు.
చేతులు కరుచుకున్న మోటో జీపీ క్షమాపణలు కోరింది. ఇందుకు సంబంధించి మోటోజీపీ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. అందులో 'మోటోజీపీ వీడియోలో ఇండియా మ్యాప్ తప్పుగా చూపించినందుకు ఇండియన్స్ కి క్షమాపణ చెబుతున్నాం. భారత్ కి వ్యతిరేకంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఫస్ట్ టైం జరుగుతున్న ఇండియన్ ఆయిల్ భారత్ గ్రాండ్ ప్రిక్స్ ని మీరంతా ఆస్వాదిస్తున్నందుకు సంతోషం' అని ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు మోటోజీపీ రేసింగ్ జరగనుంది.
Updated Date - 2023-09-22T19:18:13+05:30 IST