ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supriya Sule: 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం హస్తినలో..

ABN, First Publish Date - 2023-09-01T21:20:19+05:30

విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె తెలిపారు.

ముంబై: విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Sharad Pawar Faction) నేత సుప్రియా సూలె (Supriya Sule) తెలిపారు. ముంబై సమావేశానంతరం మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, తదుపరి సమావేశం ఢిల్లీలో ఉంటుందన్నారు. ఏ తేదీల్లో ఉండే అవకాశం ఉందని మీడియా మరోసారి అడిగినప్పుడు, మీరు (మీడియా) ఎప్పుడు జరగాలని కోరుకుంటారో అప్పుడు మేము సమావేశం నిర్వహిస్తామంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.


'ఇండియా' కూటమి తొలిసమావేశం జూన్ 23న పాట్నాలో, రెండో సమావేశం జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరుగగా, మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలో జరిగింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించే లక్ష్యంతో ముంబై సమావేశం జరిగింది. ఈసారి సమావేశాల్లో 14 మందితో కూడిన సమన్వయ కమిటీ-ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ ఏర్పాటైంది. తదుపరి సమావేశంలో కీలకమైన ఇండియా కూటమి లోగో ఆవిష్కరణతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి తుది నిర్ణయం ఖరారవుతుంది.

Updated Date - 2023-09-01T21:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising