ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NHRC : అతిక్-అష్రఫ్ హత్యలపై రంగంలోకి ఎన్‌హెచ్ఆర్‌సీ

ABN, First Publish Date - 2023-04-18T19:02:33+05:30

ఉత్తర ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmad), ఆయన సోదరుడు అష్రఫ్

Ashraf, Atiq
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmad), ఆయన సోదరుడు అష్రఫ్ (Ashraf)ల హత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మంగళవారం స్పందించింది. ఈ హత్యాకాండపై సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర పోలీసులకు నోటీసు ఇచ్చింది.

అతిక్, అష్రఫ్‌లను శనివారం రాత్రి మెడికల్ చెక్అప్ కోసం పోలీసు బందోబస్తు మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. ఆ కళాశాల వద్ద మీడియాతో వారిద్దరూ మాట్లాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడికి పాత్రికేయులమని చెప్పుకుని వచ్చిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య వారిపై కాల్పులు జరిపి, హత్య చేశారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ దారుణం జరిగింది. ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం వెంటనే స్పందించింది. దాదాపు 17 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ జంట హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్, సిట్ పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. మరోవైపు పోలీసుల దృష్టి అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్‌(Shaista Parveen)పై పడింది. అతిక్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు ఆమె హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్‌ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతిక్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమె చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు.

అతిక్‌ అహ్మద్‌, అష్రఫ్‌‌లను కాల్చి చంపిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Mukul Roy : టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ ఆచూకీ తెలిసింది

Updated Date - 2023-04-18T19:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising