ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab: ఖలిస్తానీ తీవ్రవాది ఆస్తుల్ని సీజ్ చేసిన ఎన్ఐఏ

ABN, First Publish Date - 2023-09-23T14:41:11+05:30

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం(Unlawful Activities (Prevention) Act) కింద చండీగఢ్(Chandigarh), అమృత్‌సర్‌లలో నిషేధిత సిక్కుల న్యాయ సంస్థ(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌(Gurpatwant Singh Pannu) ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం జప్తు చేసింది.

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం(Unlawful Activities (Prevention) Act) కింద చండీగఢ్(Chandigarh), అమృత్‌సర్‌లలో నిషేధిత సిక్కుల న్యాయ సంస్థ(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌(Gurpatwant Singh Pannu) ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం జప్తు చేసింది. చండీగఢ్‌లోని సెక్టార్ 15లో పన్నూన్ నివాసం వెలుపల సంబంధిత నోటీసు అంటించింది. అమృత్‌సర్‌(Amrithsar)లోని అతని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో గురుపత్వంత్ సింగ్ వ్యవసాయ భూమికి సంబంధించి కూడా నోటీసు వచ్చింది.


2020లో నమోదైన ఉగ్రవాద కేసులో అతని భూమిని ఎన్ఐఏ జప్తు చేసింది. ఆయన తండ్రి మొహిందర్ సింగ్ విభజనకు ముందు తరన్ తరణ్‌ పట్టి సబ్-డివిజన్‌లోని నాథూ చక్ గ్రామంలో నివసించేవాడు. తర్వాత వారి కుటుంబం అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్ గ్రామానికి మారింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వేర్పాటువాద సమూహ వ్యవస్థాపకులలో ఒకరు. సిక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలంటూ తరచూ ఆందోళనలు నిర్వహించేవాడు. జులై 2020లో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. అతడి ఆస్తులను అటాచ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పన్నూన్ దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్నాడని, పంజాబ్‌లోని సిక్కు యువకులను మిలిటెన్సీలో చేరడానికి ప్రేరేపిస్తున్నాడని ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2023-09-23T14:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising