ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nipah Virus: నిపా వ్యాప్తి నియంత్రణలో ఉంది.. కానీ వ్యాధి ముప్పు ఇంకా తగ్గలేదు: కేరళ సీఎం పినరయి

ABN, First Publish Date - 2023-09-19T22:05:03+05:30

కొంతకాలం నుంచి నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కోజికోడ్ జిల్లాలో ఈ నిపా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమైన వైరస్ కావడంతో..

కొంతకాలం నుంచి నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కోజికోడ్ జిల్లాలో ఈ నిపా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమైన వైరస్ కావడంతో.. ఆ జిల్లాలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. అంతేకాదు.. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్స్, థియేటర్లపై కూడా ఆంక్షలు విధించారు. అయితే.. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజుల్లో ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు.


ఈ నేపథ్యంలోనే మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిపా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని, కానీ వ్యాధి ముప్పు ఇంకా తగ్గలేదని సూచించారు. సెకండ్ వేవ్ అవకాశాలను తోసిపుచ్చలేమని అన్నారు. ప్రస్తుతానికి ఈ నిపా ముప్పు పూర్తిగా ముగిసిందని చెప్పలేమన్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించగలదని చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ జాగ్రత్తగా పని చేస్తోందని.. ఈ వైరస్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితిని నివారించవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం 994 మంది నిఘాలో ఉన్నారని వెల్లడించారు.

ఇప్పటివరకూ 304 మంది నమూనాలు సేకరించగా.. వాటిలో 267 మందికి సంబంధించిన టెస్ట్ ఫలితాలు వచ్చాయని పినరయి విజయన్ తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఆరుగురికి నిజా పాజిటివ్‌గా తేలిందని.. తొమ్మిది మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారని ఆయన అన్నారు. కోజికోడ్ జిల్లాలోనే నిపా కేసులు ఎక్కువగా ఎందుకు నమోదు అవుతున్నాయనే విషయంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా.. 2018, 2021 సంవత్సరాల్లోనూ కోజికోడ్‌ జిల్లాలోనే నిపా కేసులు నమోదవ్వడం గమనార్హం.

Updated Date - 2023-09-19T22:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising