ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nipah Virus in Kerala: నిఫా వైరస్ కలకలం.. అలర్ట్ అయిన కేరళ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-09-12T18:47:22+05:30

కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఇవాళ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు అసహజ మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 11న హైఅలర్ట్ జారీ చేశారు.

Nipah virus

కేరళలోని కోజికోడ్‌ జిల్లా(Kozhikode district)లో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా(Mansukh Mandaviya) ఇవాళ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Private Hospital)లో రెండు అసహజ మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 11న హైఅలర్ట్ జారీ చేశారు. "పరిస్థితిని సమీక్షించడానికి, నిఫా వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందాన్ని పంపినట్లు మాండవీయ చెప్పారు. నిఫా వైరస్(Nipah Virus) తో ఈ ఏడాది ఆగస్టు 30న తొలి మరణం సంభవించింది. మరొకరు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. అప్రమత్తమైన సీఎం పినరయి(CM Pinarayi Vijayan)సర్కార్ కోజికోడ్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.


ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు మాస్క్‌ లు ధరించాలని సూచించింది. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారు ఆందోళన చెందవద్దని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2018లో కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో నిఫా వైరస్ వ్యాప్తి చెందగా, 2021లో మరోసారి కోజికోడ్‌లో వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం.. ఈ వైరస్ ప్రాణాంతకరమైంది. గబ్బిలాల నుంచి వ్యాపించే ఈ వైరస్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే అప్రమత్తం కావాలంటున్నారు డాక్టర్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి తదితర వ్యాధి లక్షణాలు ఉంటాయని చెప్పారు.

Updated Date - 2023-09-12T18:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising