ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitish Kumar: సెక్రటేరియట్ ఆకస్మిక తనిఖీతో మంత్రులకు దడపుట్టించిన సీఎం

ABN, First Publish Date - 2023-09-27T14:38:35+05:30

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సెక్రటేరియట్‌ కు వెళ్లి తన మంత్రులు విధుల్లో ఉన్నారో లేరో స్వయంగా పరిశీలించారు. ఎక్కువ మంది మంత్రులు తమ కార్యాలయాల్లో లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) బుధవారంనాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సెక్రటేరియట్‌ (secretariat)కు వెళ్లి తన మంత్రులు విధుల్లో ఉన్నారో లేరో స్వయంగా పరిశీలించారు. ఎక్కువ మంది మంత్రులు తమ కార్యాలయాల్లో లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. నితీష్ కుమార్ మరోసారి బీజేపీకి చేరువకానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన సెక్రటేరియట్‌ను ఆకస్మికంగా సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


జేడీయూకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సకాలంలో తమ కార్యాలయాలకు రాగా, ఆర్జేడీ సహా ఇతర భాగస్వామ్య పార్టీలకు చెందిన మంత్రులు రాకపోవడం సీఎం గమనించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన సెక్రటేరియట్‌కు చేరుకుని, వికాస్ భవన్‌, విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ కార్యాలయంలో లేకపోవడంతో మంత్రికి ఫోన్ చేయాలని ఒక అధికారిని ఆదేశించారు. టెలిఫోన్ సంభాషణల్లో ''నేను మీ కార్యాలయంలో ఉన్నాను. మీరెక్కడ ఉన్నారు?'' అని మంత్రిని నితీష్ ప్రశ్నించారు. టైమ్‌కు ఆఫీసుకు రావాలని సూచించారు. ఆ తర్వాత అడిషనల్ చీఫ్ సెక్రటరీ కేకే పాఠక్ గురించి ఆరా తీయగా, ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. విద్యాశాఖకే చెందిన మరో అధికారి బైద్యనాథ్ వచ్చారో లేదో ఆరా తీయగా, ఆయన కూడా సకాలంలో కార్యాలయానికి రాలేదని గుర్తించారు. ఆరోగ్య శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కూడా లేకపోవడం గమినించారు.


డోర్లు మూసేశామన్న బీజేపీ

ఈనెల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన జీ-20 విందులో నితీష్ పాల్గొనడం, పాట్నాలో జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవానికి హాజరుకావడం, అకస్మాత్తుగా సెక్రటేరియట్‌ను తనిఖీ చేయడం వంటి వరుస పరిణామాలతో ఆయన మరోసారి బీజేపీ వైపు మళ్లే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నితీష్ కొట్టివేస్తుండగా, నితీష్‌కు ఎన్డీయే తలుపులు మూసేశామని బీహార్ బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు.

Updated Date - 2023-09-27T14:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising