ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramdas Athawale: నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలోకి...?

ABN, First Publish Date - 2023-07-29T20:33:42+05:30

విపక్షాల కూటమి ఇండియా ఏర్పాటుకు మొదట్నించీ విస్తృతంగా కసరత్తు చేస్తూ, ఇటీవల పాట్నాలో కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు.

పాట్నా: విపక్షాల కూటమి ఇండియా (INDIA) ఏర్పాటుకు మొదట్నించీ విస్తృతంగా కసరత్తు చేస్తూ, ఇటీవల పాట్నాలో కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)పై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయే (NDA)లో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు. బీహార్‌లో నితీష్ చేసిన అభివృద్ధి పనులపైనా ప్రశంసలు కురిపించారు. పాట్నాలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.


వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లో ఉండే అథవాలే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంగెర్ వచ్చారు. ఈ సందర్భంగా ఎన్డీయేలో చేరడానికి నితీష్ ఇష్టపడతారా అని మంత్రిని మీడియా ప్రశ్నించగా, గతంలో ఆయన తమతోనే (బీజేపీ) ఉన్నారని, ఎప్పుడైనా ఆయన తమతో చేతులు కలపవచ్చని జవాబిచ్చారు. ముంబై సమావేశానికి వెళ్లవద్దని కూడా నితీష్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయని, చాలాకాలం క్రితం తాను బీహార్ వచ్చినప్పుడు రోడ్లు బాగుండేవి కావని, ఇప్పుడు నితీష్ సారథ్యంలో రోడ్డన్నీ చక్కగా ఉన్నాయని అథవాలే ప్రశంసించారు.

Updated Date - 2023-07-29T20:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising