ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish Kumar: ఆ తర్వాతే విపక్షాల సమావేశం..!

ABN, First Publish Date - 2023-04-29T18:28:16+05:30

బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల నేతలతో తదుపరి సమావేశం పాట్నాలో జరిగే అవకాశాలున్నాయని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సుప్రీం నితీష్ కుమార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల నేతలతో తదుపరి సమావేశం పాట్నా(Patna)లో జరిగే అవకాశాలున్నాయని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) సుప్రీం నితీష్ కుమార్ (Nitish Kuamr) శనివారంనాడు సంకేతాలిచ్చారు. నాయకులంతా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున ఎన్నికలు ముగియగానే విపక్ష నేతల సమావేశం ఉంటుందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ''ఐక్య విపక్ష కూటమి''కి కోసం నితీష్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలు విపక్ష పార్టీల నేతలను వరుసగా ఆయన కలుస్తున్నారు.

''మేమంతా తప్పనిసరిగా సమావేశమవుతాం. బీజేపీపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేసే అంశంపై చర్చిస్తాం. కర్ణాటక ఎన్నికలు పూర్తి కాగానే ఎక్కడ సమావేశమయ్యేది ఖరారు చేస్తాం. పాట్నాలోనే తదుపరి సమావేశం జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ఇక్కడే సమవేశమవుతాం'' అని మీడియాతో మాట్లాడుతూ నితీష్ చెప్పారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈనెల 24వ తేదీన నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కోల్‌కతాలో కలుసుకున్నారు లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే విపక్ష ఐక్యతపై చర్చిచేందుకు బీజేపీయేతర పార్టీలతో పాట్నాలో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నితీష్‌కు మమతా బెనర్జీ సూచించారు. బీహార్‌లోనే జయప్రకాష్ నారాయణ్ ఉద్యమాన్ని ప్రారంభించారని, బీహార్‌లోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఆమె అన్నారు.

Updated Date - 2023-04-29T18:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising