ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pasupati paras: మేనల్లుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు పశుపతి పరాస్ షాక్..!

ABN, First Publish Date - 2023-07-22T20:45:35+05:30

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ లోని హజీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో చిరాగ్ పాశ్వాన్‌కు ), ఆయన మామ, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ మధ్య పీటముడి పడేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనను హజీపూర్ నుంచే పోటీ చేయకుండా ఏ శక్తి ఆపలేదని పరాస్ అన్నారు.

పాట్నా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ (Bihar)లోని హజీపూర్ (Hajipur) నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో చిరాగ్ పాశ్వాన్‌కు (Chirag paswan), ఆయన మామ, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ (Pasupati paras) మధ్య పీటముడి పడేలా కనిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను హజీపూర్ నుంచే పోటీ చేస్తానని, అక్కడి నుంచి పోటీ చేయకుండా తనను ఈ భూమిపై ఉన్న ఏ శక్తి కూడా ఆపలేదని పశుపతి పరాస్ శనివారంనాడు చెప్పారు.


హజీపూర్‌ నియోజకవర్గానికి చిరాగ్ తండ్రి దివగంత రామ్ విలాస్ పాశ్వాన్ గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల కాలంలో చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి దగ్గరవుతూ, ఎన్డీయే చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హజీపూర్ సీటు దక్కించుకోవాలని చిరాగ్ పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరాస్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఎన్డీయేలో ఇంకా చేరని చిరాగ్ కంటే తనకే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే బాసటగా నిలుస్తుందనే నమ్మకం ఉందని పరాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''ఎన్డీయేలో నేను భాగస్వామిని. అందులో సందేహమే లేదు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి చిరాగ్ హాజరై ఉండవచ్చు. పార్లమెంటులో జరిగిన కూటమి ఎంపీల సమావేశానికి చిరాగ్‌ను ఆహ్వానించలేదు. దానిని బట్టే అందరూ అర్ధం చేసుకోవచ్చు'' అని అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్డీయే సమావేశంలో చిరాగ్, పరాస్ మధ్య సయోధ్య చిగురించిందంటూ వస్తున్న ఊహాగానాలపై అడిగినప్పుడు, చిరాగ్ తనతో ఫోటో దిగుతూ, తన ఆశీస్సుల కోసం పాదాలకు నమస్కరించాడని, అది బీహార్ సంస్కృతి అని అన్నారు. మీడియా ఊహాగానాలు చేస్తున్నట్టు తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం లేదన్నారు. తాను హజీపూర్ ఎంపీనని, కేంద్ర మంత్రిగా ఉన్నానని, ఎన్డీయే భాగస్వామినని, వచ్చే ఎన్నికల్లో కూడా తాను హజీపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానని అన్నారు. హజీపూర్ సీటు తనకు కర్మభూమి అని చిరాగ్ వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ, దివగంత పాశ్వాన్ తనకు కూడా సోదరుడేనని చెప్పారు. చిరాగ్ ఇప్పటికే జముయీ నియోజకవర్గం ఎంపీగా ఉన్నందున ఆ నియోజకవర్గం పైనే ఆయన దృష్టి సారించడం మంచిదని సూచించారు.

Updated Date - 2023-07-22T20:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising