ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharmendra Pradhan: పీఎం పదవి ఖాళీ లేదు

ABN, First Publish Date - 2023-01-15T17:03:23+05:30

భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఆదివారంనాడు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తదుపరి భారత ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. ''ఇండియాలో ప్రధాని పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలకు మోదీపై నమ్మకం ఉంది. 2024లో కూడా మోదీ నాయకత్వంలో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుంది'' అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

అమర్త్యసేన్ ఏమన్నారు?

భారత తదుపరి ప్రధాని కాగలిగిన సామర్థ్యం టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీకి ఉందని తాను అనుకుంటుంన్నట్టు పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమర్త్యసేన్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఏకతాటిపైకి మమతాబెనర్జీ తీసుకురాగలరా అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. 2024 ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉంటాయనుకోవడం మాత్రం పొరపాటే అవుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కూటమి ఏర్పాటు కావాలని కాంగ్రెస్, ఎన్‌సీపీ, జేడూయూతో సహా పలు పార్టీల నేతలు పిలుపునిచ్చాయని గుర్తు చేశారు. ద్విముఖ పోటీలతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చని ఆ పార్టీల నేతలు ఉద్ఘాటించారని అమర్త్యసేన్ చెప్పారు. బీజేపీ బలంగా, శక్తివంతంగా కనిపిస్తున్నా ఇతర రాజకీయ పార్టీలు కష్టపడి పనిచేస్తే ఆ పార్టీని ఢీకొట్టగలవని తాను బావిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ బలహీనపడుతున్నట్టు కనిపిస్తున్నదని, ఎంతమంది కాంగ్రెస్‌పై ఆధారపడతారో తనకు తెలియదని అన్నారు. ఇతర పార్టీల కంటే మాత్రం అఖిల భారత్ విజన్ అందించగల పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అయితే ఆ పార్టీలోనూ విభేదాలున్నాయన్నారు. సిటిజన్‌షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలు వల్ల మెజారిటీ శక్తుల ప్రాబల్యం పెరిగి, మైనారిటీల పాత్ర తగ్గుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-15T17:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising