ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

No-Confidence Motion: ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి..?

ABN, First Publish Date - 2023-07-26T16:07:35+05:30

నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దీనికి సభాపతి ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలైంది.

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) అవిశ్వాస తీర్మానం (No-confidence motion) నోటీసు ఇవ్వడం, దీనికి సభాపతి ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలైంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 కాగా, 537 మంది ప్రస్తుతం ఉన్నారు. 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి వైపు ఎవరు నిలిచే అవకాశం ఉందనేది ఓసారి చూద్దాం.


మోదీ సర్కార్‌కు మద్దతుగా 331 మంది..

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 331 మంది సభ్యుల (లోక్‌సభ స్పీకర్‌తో కలిపి) మెజారిటీ ఉంది. అతిపెద్ద పార్టీగా బీజేపీకి సొంతంగా 301 సీట్లు ఉన్నాయి. కూటమి భాగస్వాములుగా మద్దతుగా నిలుస్తున్న పార్టీల్లో శివనేన (షిండే)-13, రాష్ట్రీయ లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఆర్ఎల్‌జేపీ)-5, అప్నా దళ్ సోనీలాల్ (ఏడీఎస్)-2, లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్)-1, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్)-1, అల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)-1, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)-1, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)-1, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)-1, సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం)-1, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)-1, ఇండిపెండెంట్లు (సుమలత, నవనీత్ కౌర్)-2 ఉన్నారు.


మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ

ఎన్‌డీఏలో భాగస్వామిగా లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి 22 మంది ఎంపీల బలం ఉంది.


విపక్ష కూటమి 'INDIA' బలం 142...

కాగా, కొత్తగా 26 పార్టీలతో ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా (INDIA)కు 142 మంది సభ్యుల బలం ఉంది. సీట్ షేర్ ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)కు 50 మంది ఎంపీలు ఉన్నారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)కు-24, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)- 23, జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ)-16, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)-6, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ-శరద్ పవార్)-4, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-3, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)-3, జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ)-3, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)-3, కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా (సీపీఐ)-2, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)-1, జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)-1, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్‌పీ)-1, విడుదలై చిరుతైగళ్ కట్టి (వీసీకే)-1, కేరళ కాంగ్రెస్ (మణి)కి ఒక ఎంపీ ఉన్నారు.


కాగా, INDIA కూటమిలో భాగస్వామ్యం లేని కేసీఆర్ సారథ్యంలోని భారత్‌ రాష్ట్ర సమితి (BRS) విపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్‌కు లోక్‌సభలో 9 మంది ఎంపీల బలం ఉంది.


తటస్థంగా ఉండే వారిలో..

కాగా, ఎన్డీయే, ఇండియా కూటమిలో ఎవరి వైపు ఉండాలనే విషయంపై ఇంకా తేల్చిచెప్పని (తటస్థ) పార్టీల్లో బిజూ జనతాదళ్‌ (బీజేడీ)కి 12 మంది ఎంపీల బలం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)-9, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)-3, ఏఐఎంఐఎం-2, శిరోమణి అకాలీ దళ్ (సాద్)-2, జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్)-1, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ)-1, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)-1, శిరోమణి అకాలీదల్ (అమృత్‌సర్)-1, స్వతంత్ర అభ్యర్థి హీరా శరణ్య ఉన్నారు.

Updated Date - 2023-07-26T16:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising