ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UCC In india: సమానత్వం, సమన్యాయం యూసీసీతోనే సాధ్యం...

ABN, First Publish Date - 2023-07-01T18:20:52+05:30

ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాద్ నఖ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీకి సూత్రప్రాయంగా ఆయన మద్దతు ప్రకటించారు. చట్టం చేయడానికి ఇదే తగిన సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పెడూ యూసీసీపై చట్టం తేలేమని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు కోసం కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ(BJP) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాద్ నఖ్వి (Mukhtar Abbas Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీకి సూత్రప్రాయంగా ఆయన మద్దతు ప్రకటించారు. చట్టం చేయడానికి ఇదే తగిన సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పెడూ యూసీసీపై చట్టం తేలేమని అన్నారు. ఏడు దశాబ్దాలుగా స్వప్రయోజనాలను ఆశించే మతతత్వ కుట్రదారుల కంబంధ హస్తాల్లో చిక్కుకున్న యూసీసీకి విముక్తి కల్పించాలనే వాతావరణం దేశంలో నెలకొందని చెప్పారు.

''అందరినీ కలుపుకొని వెళ్లే సంస్కరణ (యూసీసీ) అమలుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదు" అని శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ నఖ్వి చెప్పారు. యూసీసీతో అందరికీ సమానత్వం, సమన్యాయం జరుగుతుందని అన్నారు. ఏడుదశాబ్దాలు కేవలం తమ స్వప్రయోజనాల కోసం మతతత్వ కుట్రదారుల చేతిల్లో బందీగా చిక్కుకున్న యూసీసీకి విముక్తి కల్పించాలని యావద్దేశం ఆసక్తితో ఉందని చెప్పారు.

విపక్షాలపై విసుర్లు

యూసీసీపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై నఖ్వి విమర్శలు గుప్పించారు. మమతత్వ రాజకీయాలను పక్కనపెట్టి అంతరాత్మ ప్రభోధం మేరకు నడుచుకోవాలని ఆ పార్టీలకు హితవు పలికారు. ఉమ్మడి పౌర స్మృతి వంటి ప్రగతిశీలక చట్టం వల్లం అందరికీ సమానత్వం, సమన్యాయం సాధ్యమవుతుందని అన్నారు. 1985లో కాంగ్రెస్ చేసిన పొరపాటుతో దేశం దశాబ్దాలపాటు శిక్ష అనుభవించిందని, షాబానో కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో సంఖ్యాబలం ఆధారంగా సమ్మిళిత సంస్కరణపై మతపరమైన దాడి చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకు దేశం శిక్ష అనుభవించాల్సి వచ్చిందని అన్నారు.

ఒకే కుటుంబంలో రెండు చట్టాలు సరికాదని, అలాగే దేశంలో కూడా రెండు చట్టాలు సరికాదని, అందరికీ ఒకే చట్టం ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల యూసీసీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బీజేపీ ఎన్నికల వాగ్దానాల్లో కూడా చాలాకాలంగా యూసీసీ కీలకంగా ఉంది. 370వ అధికరణ రద్దు చేస్తామనే ఎన్నికల హామీని బీజేపీ కొద్దికాలం క్రితమే నిలబెట్టుకోగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం కార్యరూపంలోకి వచ్చింది. 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో యూసీసీకి ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే పట్టుదలతో బీజేపీ ఉంది.

Updated Date - 2023-07-01T18:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising