Home » UCC
దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ చీప్ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులగణన అవసరమేనని అన్నారు. అయితే ఇది సమాజ విభజనకు దారితీస్తుందని, నిర్దిష్ట డాటాను బహిర్గతం చేయరాదని హెచ్చరించారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్‌కు ఇంతవరకూ 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని లా కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని పేర్కొంది.
ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అంశంపై ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సమావేశంలో UCC అంశంపై సీఎం జగన్ ఎటూ తేల్చకపోవడం గమనార్హం. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం కలిగితే వ్యతిరేకిస్తామని జగన్ చెప్పినప్పటికీ, UCCపై స్పష్టంగా హామీ ఇవ్వాలంటూ ముస్లిం మత పెద్దలు కోరినా సీఎం జగన్ సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పై రేపు(బుధవారం) ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి.
దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై ముసాయిదా బిల్లును ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మాత్రమే దానిపై స్పందించాలని నిర్ణయించింది.
ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC) అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తన్‌ఖా, కేటీఎస్ తులసి, మనీశ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు.
ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపింది.
ఉమ్మడి పౌర స్మృతి అమలు విషయంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం జాగరూకతతో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రాటిక్ ప్రొగ్రసిస్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ అజాద్ అన్నారు. యూసీసీని అమలు చేయడమంటే జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణను రద్దు చేసినంత సులువు కాదన్నారు.