ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్‌పై 'ఎన్ఎస్ఏ' కేసు, రెండో కారు స్వాధీనం

ABN, First Publish Date - 2023-03-21T14:28:59+05:30

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌పై అత్యంత కఠినమైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్: పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)పై అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి అమృత్‌పాల్, అతని అసోసియేట్స్‌పై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు జలంధర్-మొగ రోడ్డులోని మెహత్‌పూర్ గ్రామంలోనూ, ఆ పరిసర ప్రాంతాల్లోనూ అమృత్‌పాల్ సహచరులను పలువురుని అరెస్టు చేశారు.

అమృత్‌సింగ్‌ వాహనాన్ని పోలీసులు నాలుగురోజుల క్రితం 25 కిలోమీటర్లు వెంబడించారు. అయితే ఇరుకు రోడ్లు, రద్దీలో అతను తప్పించుకున్నాడు. షాకోట్‌ దగ్గరోని సలేమా గ్రామంలో అమృత్‌పాల్‌ గ్యాంగ్‌ వదిలేసిన కారును పోలీసులు గుర్తించారు. కారులో రైఫిల్‌, 57 లైవ్‌ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్ తప్పించున్న అనంతరం అతని మామ హర్జిత్ సింగ్‌తో సహా పలువురుని అరెస్టు చేసి డిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇంతవరకూ ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, 114 మందిని అరెస్టు చేశామని పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్‌క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు.

మరో కారు స్వాధీనం..

కాగా, తప్పించుకుని పారిపోయే క్రమంలో అమృత్‌పాల్ ఉపయోగించిన రెండో కారును పంజాబ్ పోలీసులు మంగళవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. అందులో అతని దుస్తులు కనిపించాయి. పోలీసుల గాలింపు సమాచారం తెలియగానే అతను తన మెర్సిడెస్ వాహనాన్ని వదిలేసి బ్రెజా కారులో వేరే రూటులో పారిపోయాడు. పోలీసు వేట ముమ్మరం కావడంతో పంజాబ్ సరిహద్దులను అమృత్‌పాల్ దాటేసి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. కాగా, ఇంటర్నెట్ సేవలపై పోలీసులు విధించిన ఆంక్షలను మంగళవారంనాడు కాస్త సడలించారు. తరన్ తరన్, ఫిరోజ్‌పూర్, మోఘా, సంగ్రూర్, అజ్నాలా సబ్ డివిజన్, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈనెల 23వ తేదీ వరకూ ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

ఫ్లాగ్‌మార్చ్..

రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు జలంధర్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పంజాబ్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అతని అనుచరుల పలువురుని అరెస్టు చేశామని ఏసీపీ నిర్మల్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఫ్యాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2023-03-21T14:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising