ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breaking News: కాల్పుల ఘటనలో ఒడిశా మంత్రి కన్నుమూత

ABN, First Publish Date - 2023-01-29T20:12:38+05:30

ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్‌ (Naba Kisore Das)పై అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు.

Odisha Health Minister Naba Kishore Das dies in firing incident
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశా (Odisha) ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్‌ (Naba Kisore Das)పై అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు. గోపాల్ దాస్ రెండుసార్లు కాల్పులు జరిపాడని, మంత్రి ఛాతీపై బుల్లెట్ గాయాలయ్యాయని భ్రజ్‌రాజ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి తన కారు నుంచి బయటకు వస్తుండగా ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. మంత్రిపై కాల్పులకు పాల్పడిన ఏఎస్ఐను స్థానిక ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఏ కారణంతో మంత్రిపై గోపాల్ దాస్ ఏఎస్ఐ కాల్పులు జరిపాడనేది తెలియాల్సి ఉంది.

మంత్రి నాబా కిషోర్ దాస్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై క్రైం బ్రాంచ్ దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను వదలబోమన్నారు.

Updated Date - 2023-01-29T21:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising