ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident: ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించిన సీఎం

ABN, First Publish Date - 2023-06-04T15:41:16+05:30

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని 288 మంది మృతిచెందిన నేపథ్యంలో కోల్‌కతా వెళ్లే ప్రయాణికుల కోసం ఉచిత బస్సు సర్వీసులను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రైలు సర్వీసులు పునరుద్ధరించేంత వరకూ ఈ సదుపాయం అమలులో ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని 288 మంది మృతిచెందిన నేపథ్యంలో కోల్‌కతా వెళ్లే ప్రయాణికుల కోసం ఉచిత బస్సు సర్వీసులను (Free Bus Sevices) ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రకటించారు. ప్రమాదం కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు వెళ్లే వారి కోసం ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణ ఖర్చులు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెచ్చించనున్నట్టు పేర్కొంది. బాలాసోర్ మార్గంలో రైలు సర్వీసులు పునరుద్ధరించేంత వరకూ ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పూరీ, భువనేశ్వర్, కటక్‌ సిటీల నుంచి కలకత్తాకు ప్రతిరోజూ 50కి పైగా సర్వీసులు నడుపుతుంటారు.

కాగా, రైలు ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒడిసా వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది బాధితులు భూవనేశ్వర్, బాలాసోర్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, బాలాసోర్‌ ప్రమాద స్థలిలో ట్రాక్, తదితర పునరుద్ధరణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు తాజాగా వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొంది. మూడు రైళ్లు ఢీకొన్నాయని తప్పుగా భావించరాదని, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని తెలిపింది. ముడి ఇనుముతో ఉన్న గూడ్స్‌ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్రత ఎక్కవైందని చెప్పింది.

Updated Date - 2023-06-04T15:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising