ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2023-06-04T19:19:09+05:30

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. మరోవైపు మానవతప్పిదమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతేకాకుండా దీనిపై ఇద్దరు రైల్వే అధికారుల ఫోన్‌కాల్ సంభాషణ కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ విచారణను సీబీఐకి అప్పగించాలని ఇండియన్ రైల్వే బోర్డు నిర్ణయించినట్లు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.

కాగా..ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 290కి చేరింది. సుమారు 900 మంది గాయపడి ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రులలో 1,175 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతుండగా.. వారిలో 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. 382 మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతావారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఒడిశా ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - 2023-06-04T19:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising