ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Special Session: పాత పార్లమెంట్ భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-09-18T12:17:32+05:30

కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్‌ భవనంలో జరిగే చివరి సెషన్‌ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్‌ భవనంలో జరిగే చివరి సెషన్‌ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది ఒక కీలకమైన ఘట్టమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుందని అన్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. నిర్మాణానికి దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని కొనియాడారు. గత 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు. భారత్ సాధించిన విజయాలపై ప్రపంచం చర్చిస్తోందని, చంద్రయాన్-3 విజయం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని పునరుద్ఘాటించారు. ఈ పార్లమెంట్ దేశ శాస్త్రవేత్తలను అభినందిస్తుందని అని మోదీ అన్నారు.


G20 విజయం దేశానిది.. పార్టీలది కాదు

ఇటివలే విజయవంతంగా ముగిసిన జీ20 సదస్సుపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. జీ20కి అధ్యక్షత వహించడం భారతదేశానికి చెందిన విజయం అవుతుందన్నారు. వ్యక్తులకో లేదా పార్టీలకో అపాదించరాదని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. భారత్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇందుకు దేశ సంస్కృతి, వేదాల నుండి వివేకానందుడి వరకు ప్రతిదీ కారణమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు... దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోతున్నానని అన్నారు. దేశం నుంచి ఇంతటి ప్రేమ, గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్నారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌‌ఫామ్‌పై నిద్రించిన చిన్నారి ఏదో ఒక రోజు పార్లమెంటులో మాట్లాడతాడని ఊహించలేదని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.


ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..

జీ20 అధ్యక్ష పదవిని విజయవంతం పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. జీ20 సదస్సులో తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని, ప్రపంచానికి కొత్త దిశను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సున్నితమైన విషయాలపై కూడా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. గత 9 సంవత్సరాలలో ఇండియా ఎలా అభివృద్ధి చెందిందో ఈ పరిణామం తెలియజేస్తోందని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభోపన్యాసంలో స్పీకర్ ఈ విధంగా స్పందించారు.

Updated Date - 2023-09-18T12:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising