ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Omar Abdullah: మేము ఇండియా కూటమి పేరు మారుస్తాం.. దేశాన్ని ఇబ్బంది పెట్టొద్దు

ABN, First Publish Date - 2023-09-06T20:13:32+05:30

జీ20 సదస్సు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. అప్పటి...

జీ20 సదస్సు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారన్న ప్రచారం జోరందుకుంది. దేశం పేరుని మార్చే ఉద్దేశంతోనే ఇండియా స్థానంలో భారత్‌ని ముద్రించారనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమికి ఇండియా పేరు పెట్టడం వల్లే దేశం పేరుని భారత్‌గా మార్చాలని కేంద్రం ఒత్తిడి తెస్తే.. తాము తమ కూటమి పేరుని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.


‘‘ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియా పేరు పెట్టడం వల్లే దేశానికి ‘భారత్’గా పేరు మార్చాలని కేంద్రం ఒత్తిడి చేస్తే.. మేము మా కూటమి పేరుని మార్చుకుంటాం. కేవలం పేరు కోసం మేము దేశాన్ని ఇబ్బందుల్లో నెట్టాలని కోరుకోవడం లేదు. మేము దేశంపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక కూటమిగా ఏర్పడ్డామే తప్ప.. భారం పెంచేందుకు కాదు. ఒకవేళ ‘ఇండియా’ కూటమి వల్లే దేశానికి పేరు మారుస్తున్నారని మాకు ఒక చిన్న సంకేతం అందినా.. కూటమి పేరుని వెంటనే మార్చుకుంటాం’’ అని ఒమర్ అబ్దుల్లా మీడియాతో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాజ్యాంగంలో భారతదేశం, ఇండియా రెండింటినీ దేశం పేర్లుగా పేర్కొన్నారన్న సంగతిని గుర్తు చేశారు. కాబట్టి.. ఇండియాని తొలగించడం సమంజసం కాదని హితవు పలికారు.

“ఇండియా, భారత్.. దేశానికి ఈ రెండు పేర్లను వాడుకోవచ్చని రాజ్యాంగంలో రాసి ఉంది. ప్రధాని మోదీ ప్రయాణించే విమానాన్ని చూస్తే.. దానిపై భారత్‌తో పాటు ఇండియా అని కూడా రాసి ఉండటాన్ని గమనించవచ్చు’’ అని ఒమర్ తెలిపారు. ఒకవేళ ప్రధాని కొన్ని కారణాల వల్ల ఇండియా పేరు వినియోగించుకోకూడదని అనుకుంటే, ఆ పేరుని పక్కన పెట్టేయాలి గానీ.. రాజ్యాంగం నుంచి తొలగించకూడదన్నారు. ఒకవేళ ఇండియా పేరుని తొలగించాలనుకుంటే.. దాన్ని ఎక్కడి నుంచి తొలగిస్తారని ప్రశ్నించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇస్రో, ఐఐటీ, ఐఐమ్, గుర్తింపు కార్డులు.. ఇలా అన్నింటిలోనూ ఇండియాని భారత్‌గా మారుస్తారా? అని నిలదీశారు.

Updated Date - 2023-09-06T20:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising