ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సివిల్ రిజిస్ట్రేషన్లకు ఇకపై బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు

ABN, First Publish Date - 2023-09-14T15:12:15+05:30

సివిల్ రిజిస్ట్రేషన్లన్నింటికీ(Civil Registraions) చాంతాడంత సర్టిఫికేట్లు(Certificates) అవసరమయ్యేవి. త్వరలో ఆ బాధ తీరనుంది. బర్త్ సర్టిఫికేట్(Birth Certificate) ఒక్కటి ఉంటే చాలు అన్ని రకాల సేవల్ని పొందవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది.

సివిల్ రిజిస్ట్రేషన్లన్నింటికీ(Civil Registraions) చాంతాడంత సర్టిఫికేట్లు(Certificates) అవసరమయ్యేవి. త్వరలో ఆ బాధ తీరనుంది. బర్త్ సర్టిఫికేట్(Birth Certificate) ఒక్కటి ఉంటే చాలు అన్ని రకాల సేవల్ని పొందవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 (20 ఆఫ్ 2023) సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్రం 2023 అక్టోబర్ 1వ తేదీ నుంచి చట్టం అమల్లోకి తేనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. పార్లమెంటు(Parliament) ఉభయ సభలు వర్షాకాల సమావేశాల్లో జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023ను ఆమోదించాయి.


ఆగస్టు 7న రాజ్యసభ(Rajyasabha) మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించగా, ఆగస్టు 1న లోక్‌సభ ఆమోదించింది. 1969 చట్టానికి సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రూపొందించారు. జననాలు, మరణాల జాతీయ డేటాబేస్ ను నిర్వహించడానికి ఈ చట్టం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. చీఫ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు సంబంధిత డేటాను జాతీయ డేటాబేస్‌ పంపుతారు. ఇంతకుముందు, కొంతమంది వ్యక్తులు జనన మరణాలను రిజిస్ట్రార్‌(Registrar)కు నివేదించాల్సి ఉండేది. ఉదాహరణకు, ఓ ఆసుపత్రి(Hospital)లో శిశువు జన్మిస్తే సంబంధిత డాక్టర్ జననాన్ని నమోదు చేయాలి. కొత్త చట్టం ప్రకారం, శిశువు తల్లిదండ్రులు వారి ఆధార్ నంబర్‌ను కూడా అందించాలి. జైలులో ప్రసవాలు జరిగితే జైలర్‌కు, హోటల్ లేదా లాడ్జి లో జన్మిస్తే ఆయా యాజమాన్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

Updated Date - 2023-09-14T15:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising