ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘Operation Kaveri’: సూడాన్ నుంచి 1400 మందిని తీసుకొచ్చిన వాయు సేన.. వచ్చినవారిలో ఓ వ్యక్తి ప్రత్యేకత ఏమిటంటే..

ABN, First Publish Date - 2023-05-01T15:12:12+05:30

సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి ‘ఆపరేషన్ కావేరీ’ ద్వారా భారతీయులను స్వదేశానికి రప్పిస్తున్నారు.

Indian origin people from Sudan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి ‘ఆపరేషన్ కావేరీ’ ద్వారా భారతీయులను స్వదేశానికి రప్పిస్తున్నారు. ఈ సహాయక కార్యక్రమంలో భాగంగా భారత వాయు సేన (Indian Air Force-IAF) దాదాపు 1,400 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది. ఆ దేశంలో ఉన్న సుమారు 3,000 మందిని స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 2,500 మందికిపైగా భరత గడ్డపై అడుగుపెట్టి, బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.

‘ఆపరేషన్ కావేరీ’లో భాగంగా ఐఏఎఫ్ విమానాల్లో దాదాపు 1,400 మంది స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా సీ-130 జే విమానంలో 260 మందిని తీసుకొచ్చినట్లు ఐఏఎఫ్ ఓ ట్వీట్‌లో తెలిపింది. వీరిలో 90 సంవత్సరాల వయసు పైబడినవారు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో ఒకరి వయసు 102 సంవత్సరాలని వివరించింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) ఇచ్చిన ట్వీట్‌లో, ఆపరేషన్ కావేరీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 186 మంది భారతీయులు సూడాన్ నుంచి కొచ్చి చేరుకున్నారని తెలిపారు. సూడాన్ నుంచి భారతీయులను వెనుకకు రప్పించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సూడాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన 9వ ట్రిప్ ఇది అని తెలిపారు. మొత్తం మీద సూడాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నవారి సంఖ్య 2,500 దాటింది.

ఆపరేషన్ కావేరీలో భాగంగా భారత ప్రభుత్వం సైనిక విమానాలను, యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ఇండిగో విమానాల్లో కూడా కొందరిని తీసుకొచ్చారు.

ఏమిటి ఈ యుద్ధం?

సూడాన్ ఆర్మీ లీడర్ అబ్డెల్ ఫట్టాహ్ అల్-బుర్హాన్, ఆయన సబార్డినేట్ అధికారి, పారామిలిటరీ రేపిడ్ సపోర్ట్ సోల్జర్స్ కమాండర్ మహమ్మద్ హమ్దాన్ డగ్లో వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో 528 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 4,599 మంది గాయపడ్డారు. దీంతో సూడాన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో 150 సంవత్సరాల నుంచి ఉంటున్న భారతీయులు సుమారు 1,200 మంది ఉన్నారు. వీరు కాకుండా మరో 2,800 మంది భారతీయులు అక్కడ ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు

Karnataka Polls : రైతులకు సున్నా వడ్డీకే రుణాలు.. పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు..

Updated Date - 2023-05-01T15:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising