ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

ABN, First Publish Date - 2023-07-27T10:35:11+05:30

ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానంపై లోక్ సభలో త్వరలో చర్చ జరుగుతుంది.

మణిపూర్‌లో మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రతిపక్షాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి.


ఇదిలావుండగా, కొందరు మంత్రులు, ఎంపీలు పార్లమెంటులో మాట్లాడేటపుడు నినాదాలు చేయకూడదని ప్రతిపక్ష కూటమి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మరికొందరు ఎంపీలు సభలలో మాట్లాడేటపుడు నినాదాలు చేయకుండా, మౌనంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

స్టార్డ్ క్వశ్చన్స్ సమయంలో మణిపూర్ సమస్యను వ్యూహాత్మకంగా లేవనెత్తాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని వీరు నిర్ణయించుకున్నారు. మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ, ప్రభుత్వం మాట్లాడేలా ఒత్తిడి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి :

Puducherry: గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

Updated Date - 2023-07-27T10:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising