ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament : ఆప్ ఎంపీకి మద్దతుగా రాత్రంతా ప్రతిపక్ష ఎంపీల ధర్నా

ABN, First Publish Date - 2023-07-25T11:18:50+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు సోమవారం రాత్రంతా బృందాల వారీగా ధర్నా చేశారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

Sanjay Singh

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh)ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి సభ్యులు సోమవారం రాత్రంతా బృందాల వారీగా ధర్నా చేశారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మణిపూర్‌లో హింసాకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంటులో చర్చను ప్రారంభించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా మంగళవారం కూడా కొనసాగుతోంది.

సంజయ్ సింగ్ మంగళవారం ఉదయం ఇచ్చిన ట్వీట్‌లో, తాను మహాత్మా గాంధీ విగ్రహం ముందు ధర్నా చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోను జత చేశారు. మణిపూర్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఇచ్చిన ట్వీట్‌లో, సోమవారం ఉదయం ప్రారంభమైన నిరసన కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగుతోందని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద టీమ్ ఇండియా (I.N.D.I.A) కూటమి పార్టీల సభ్యులు వంతులవారీగా సోమవారం రాత్రి కూడా ధర్నా చేసినట్లు తెలిపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను రాజ్యసభ నుంచి ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ పార్లమెంటులో చర్చించాలని కోరినందుకు ఆయనను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఆయనకు సంఘీభావంగా తాము ధర్నా చేస్తున్నామన్నారు. మణిపూర్ రాష్ట్రానికి న్యాయం కోసం తామంతా సంఘటితంగా ఉన్నామన్నారు. మణిపూర్‌లో బీజేపీ పాలనలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రధాని మోదీ కొంచెం సిగ్గుపడాలని, దీని గురించి ఆయన మాట్లాడాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

రాజ్యసభ చైర్మన్ ఆదేశాలను పదే పదే ఉల్లంఘించినందుకు సంజయ్ సింగ్‌ను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సోమవారం సస్పెండ్ చేశారు.

మణిపూర్‌లో మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బయటపడిన వీడియోలు దేశాన్ని వణికించాయి.

ఇవి కూడా చదవండి :

CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

Updated Date - 2023-07-25T11:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising