ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indo-pak Love Story: ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ కథ సుఖాంతం...

ABN, First Publish Date - 2023-07-09T15:50:23+05:30

ఇది రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఇండో-పాక్ లవ్ స్టోరీ. యూపీలోని తన ప్రియుడిని దక్కించుకునేందుకు నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్‌ సరిహద్దులను అక్రమంగా దాటి ఇండియాకు వచ్చిన సీమా గులాం హైదర్ కథ సుఖాంతం కానుంది. హిందూ మతంలోకి మారిన సీమ.. తన పేరును సీమ సచిన్‌గా మార్చుకుంది. సీమను తమ కోడలు చేసుకునేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకు రావడంతో త్వరలోనే వీరి వాహహం జరుగనుది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఇది రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఇండో-పాక్ లవ్ స్టోరీ (Indo-pak Love Story). ఉత్తరప్రదేశ్‌లోని తన ప్రియుడిని దక్కించుకునేందుకు నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్‌ సరిహద్దులను అక్రమంగా దాటి ఇండియాకు వచ్చిన సీమా గులాం హైదర్ (Seema Ghulam Haider) కథ. తన ప్రియుడు సచిన్ మీనాను దక్కించుకునేందుకు హిందూ మతంలోకి మారిన సీమ.. తన పేరును సీమ సచిన్‌గా మార్చుకుంది. తన నలుగురు పిల్లల పేర్లను రాజ్, ప్రియాంక, పారి, మున్నిగా మార్చింది. సచిన్ కుటుంబం కూడా సంతోషంగా సీమను తమ కోడలు చేసుకునేందుకు ముందుకు రావడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తర్వలోనే సీమాసచిన్‌ల వివాహం జరగబోతోంది.


రీల్ రివైండ్..

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఖైరాపూర్‌లో ఉంటున్న సీమా హైదర్ తన ప్రియుడిని దక్కించుకునేందుకు కరాచీ నుంచి దుబాయ్ చేరుకుంది. అక్కడి నుంచి నేపాల్‌కు వచ్చింది. మే 13న సరైన డాక్యుమెంట్లు లేకుండానే చట్టవిరుద్ధంగా ఇండియాలోకి అడుగుపెట్టింది. తన ప్రయాణం ప్రమాదకరమని తెలిసి కూడా ఇంతటి సాహసానికి ఒడిగట్టిన సీమ...ఇందుకోసం తనకున్న చిన్నపాటి భూమిని రూ.12 లక్షలకు తెగనమ్మింది.


సచిన్ తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలో సీమ, నలుగురు పిల్లలను ఉంచాడు. తొలుత తాను ఢిల్లీ నుంచి వచ్చానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నానని ఇరుగుపొరుగు వారికి చెబుతూ వచ్చిన సీమ, క్రమంగా ఉర్దూపదాల వాడకం మాని, హిందీలోనే మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే, కొందరికి ఆమె పాకిస్థాన్ యువతనే అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగడంలో సీమ, సచిన్‌లు వల్లభ్‌గఢ్‌కు పారిపోయారు. అయితే జూలై 4న ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారంనాడు నొయిడా సిటీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు ఈ జంట తిరిగి యూపీలోని తమ ఇంటికి చేరుకున్నారు.


పెళ్లి చేసుకుంటున్నాం...

ఇంటికి తిరిగిరాగానే సీమ, సచిన్‌లు హిందూ సంప్రదాయం ప్రకారం తాము త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు. తన కుటుంబసభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకరించినట్టు సచిన్ తెలిపారు. సీమకు భారత పౌరసత్వం ఇవ్వాల్సిందిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కోరారు. కాగా, తాను హిందూ మతంలోకి మారినట్టు సీమ తెలిపింది. సీమ అనే పేరు సహజంగానే రెండు మతాల వారు పెట్టుకుంటారని, అందువల్ల ఆ పేరు ఉంచుకోమని సచిన్ సలహా ఇచ్చాడని, హైదర్‌ అనే తన ఇంటిపేరును సచిన్‌గా మార్చుకున్నానని సీమ సచిన్ తెలిపింది. పిల్లలకు కూడా హిందూ పేర్లు మార్చినట్టు చెప్పింది. తామిరువురు మార్చి 15న ఖాట్మాండులో పెళ్లి చేసుకున్నామని, అయితే డాక్యుమెంటరీ సాక్ష్యాలు లేవని ఉభయులూ తెలిపారు.


మాజీ భర్త వీడియో మెసేజ్...

సీమ కథలో చిన్న ట్విస్ట్ కూడా చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న సీమ భర్త గులాం హైదర్ ఒక వీడియో మెసేజ్‌లో సీమను పాకిస్థాన్ పంపాలని, తమను తిరిగి కలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇస్లాంలో కానీ హిందూమతంలో కానీ విడాకులు తీసుకోకుండా పెళ్లయిన యువతిని మరో యువకుడు పెళ్లాడరాదనే కట్టుబాటు ఉందని హైదర్ వాదించాడు. అయితే, సీమ తన మాజీ భర్త వాదనను కొట్టిపారేసింది. హైదర్‌ తనకు ఫోనులోనే విడాకులు ఇచ్చాడని, అప్పట్నించీ చాలా కాలంగా తాము దూరంగానే ఉంటున్నామని తెలిపింది.


పెళ్లి అక్షింతలు సిద్ధం..

హిందూ మతంలోకి మారిన సీమ-సచిన్‌లను వివాహబంధంతో ఏకం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సచిన్ తల్లిదండ్రులు చెప్పారు. గంగానదిలో పవిత్ర స్నానాలు చేయించి ఇద్దరికీ హిందూ సంప్రదాయప్రకారం త్వరలోనే పెళ్లి చేయనున్నట్టు వారు ప్రకటించారు. ఈ జంటను వివాహబంధంతో కలిపేందుకు ఇరుగుపొరుగు వారు కూడా ముందుకు వచ్చారు. ఒకరినొకరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నప్పడు వారిని కలిసి జీవించేలా ఆశీర్వదించడమే మంచిదంటూ పెళ్లి ఏర్పాట్లకు వారంతా సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-07-09T15:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising