ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

ABN, First Publish Date - 2023-04-21T11:49:40+05:30

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పాఠ్యాంశాల్లోని సైన్స్ సిలబస్ నుంచి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఉపసంహరించాలని

Theory of evolution
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పాఠ్యాంశాల్లోని సైన్స్ సిలబస్ నుంచి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఉపసంహరించాలని ఎన్‌సీఈఆర్‌టీ (National Council of Educational Research and Training) తీసుకున్న నిర్ణయంపై వందలాది మంది శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సైంటిఫిక్ టెంపర్‌ను అభివృద్ధి చేసుకోవడం కోసం పరిణామ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని వీరు తెలిపారు. దీని గురించి విద్యార్థులకు తెలియజేయకపోవడాన్ని తప్పుబట్టారు.

దేశవ్యాప్తంగా సభ్యులుగల స్వచ్ఛంద సంస్థ బ్రేక్‌త్రూ సైన్స్ సొసైటీ (Breakthrough Science Society)కి చెందిన ఈ శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలు ఓ బహిరంగ లేఖను రాశారు. పాశ్యాంశాల నుంచి పరిణామాన్ని తొలగించడానికి వ్యతిరేకంగా వినతి (An Appeal Against Exclusion of Evolution from Curriculum) పేరుతో ఈ లేఖను రాశారు. సెకండరీ ఎడ్యుకేషన్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ లేఖపై దాదాపు 1,800 మంది సైంటిస్టులు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తలు సంతకాలు చేశారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), ఐఐటీలు వంటి ప్రముఖ సంస్థలకు చెందినవారు వీరిలో ఉన్నారు.

సైన్స్ యొక్క ప్రాథమిక ఆవిష్కరణ గురించి విద్యార్థులకు తెలియకపోతే, వారి ఆలోచనా ధోరణి కుంటుపడుతుందని వీరు తెలిపారు. పరిణామ జీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, దానిపై పట్టు సంపాదించడం జీవ శాస్త్రంలోని ఉప శాఖలకు చాలా ముఖ్యమని, అంతేకాకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా కీలకమని తెలిపారు. సమాజాలుగా, దేశాలుగా మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో మనం ఏ విధంగా వ్యవహరించాలనే అంశాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే శాస్త్ర విభాగం పరిణామ జీవశాస్త్రమని తెలిపారు. ఔషధాలు, వైద్య రంగం నుంచి ఎపిడమియాలజీ, ఎకాలజీ, పర్యావరణం వంటివాటి నుంచి మానసిక ఆరోగ్య శాస్త్రం వరకు అన్నిటిలోనూ ఏ విధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోవడంపై అత్యధిక ప్రభావం చూపే శాస్త్ర విభాగం పరిణామ జీవశాస్త్రమని తెలిపారు. తోటి మానవులను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి? జీవితంలో వారి స్థానం ఏమిటి? అనే అంశాలకు కూడా దీనితో సంబంధం ఉందన్నారు. మనలో చాలా మంది బాహాటంగా తెలుసుకోకపోయినప్పటికీ, ఏదైనా మహమ్మారి ఏ విధంగా వృద్ధి చెందుతుంది? లేదా కొన్ని జీవులు ఎందుకు అంతరించిపోతున్నాయి? వంటి అనేక ఇతర ముఖ్యమైన అంశాల గురించి మనం అర్థం చేసుకోవడానికి సహజ ఎంపిక సిద్ధాంతాలు ఉపయోగపడతాయని చెప్పారు.

ఎన్‌సీఈఆర్‌టీ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్‌లో, పదో తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో సైన్స్ సబ్జెక్టులో చాప్టర్-9ను కేవలం ‘హెరెడిటీ’గా మాత్రమే ఉంచినట్లు తెలిపింది. అంతకుముందు ఈ చాప్టర్ ‘హెరెడిటీ అండ్ ఇవల్యూషన్’ అని ఉండేది. ఈ చాప్టర్ నుంచి తొలగించిన భాగాల్లో, చార్లెస్ రాబర్ట్ డార్విన్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, మాలెక్యులార్ ఫైలోజెనీ, ఇవల్యూషన్, ట్రేసింగ్ ఇవల్యూషనరీ రిలేషన్‌షిప్స్ వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Jammu & Kashmir: ఉగ్రదాడిలో అమరులైన జవన్ల పేర్లు విడుదల..

Union Minister: అయ్యో దేవుడా.. ఆయన కూడా ఓ స్టార్‌ క్యాంపైనరా!

Updated Date - 2023-04-21T11:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising