ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Air India row: భోజనంలో రాయి...మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-01-10T19:04:27+05:30

మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఎయిర్ ఇండియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఎయిర్ ఇండియా (Air india) మరో వివాదంలో చిక్కుకుంది. విమానంలో తనకు సరఫరా చేసిన భోజనంలో (Meals) రాయి (Stone) వచ్చిదంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఈ తరహా నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదంటూ 'ఎయిర్ ఇండియా' దృష్టికి ఈ విషయం తీసుకెళ్లింది. సర్వప్రియ సాంగ్వాన్ అనే ఆ మహిళా ప్రయాణికురాలు ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. ''రాళ్లు లేని భోజనం అందించడానికి మీకు ఎలాంటి వనరులు, డబ్బులు అవసరం లేదు. AI 215 విమానంలో ఇవాళ నాకు సరఫరా చేసిన ఆహారంలో ఇది (రాయి) వచ్చింది. విమాన సిబ్బంది మిస్ జడోన్‌ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాను. ఈ తరహా నిర్లక్ష్యం తగదు'' అని ఆమె ట్వీట్ చేశారు.

సర్వప్రియ సాంగ్వాన్ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. ''విమానయాన రంగంలో జేఆర్‌డీ టాటా ఒకప్పుడు ఎన్నో ప్రమాణాలు నెలకొల్పింది. అంతర్జాతీయంగా కూడా గౌరవం పొందింది. మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ప్రమాణాల స్థాయి పడిపోయింది. నిన్న పీగేట్, నేడు ఈ ఘటన. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్లక్ష్యమే కారణమా?'' అని ఒక యూజర్ ప్రశ్నించారు.

ఎయిర్ ఇండియా స్పందన...

వరుస విమాన ఘటనలతో ఏవియేషన్ రెగ్యులేటరీ పరిశీలనలో ఉన్న ఎయిర్ ఇండియా తాజా ఘటనపై వెంటనే స్పందించింది. ఈ ఘటనపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని కేటరింగ్ టీమ్ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పింది. తదుపరి చర్యలను సాధ్యనంత తర్వగా తెలియజేస్తామని వివరణ ఇచ్చింది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చిన మహిళా ప్రయాణికురాలిని అభినందించింది.

Updated Date - 2023-01-10T19:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising