ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shahid Latif: పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి లతీఫ్ హత్య

ABN, First Publish Date - 2023-10-11T12:33:12+05:30

దాదాపు ఎనిమిదేళ్లక్రితం జరిగిన పఠాన్ కోట్ ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తీవ్రవాది షాహీద్ లతీఫ్ (Shahid Latif) పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు.

న్యూఢిల్లీ: దాదాపు ఎనిమిదేళ్లక్రితం జరిగిన పఠాన్ కోట్ ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తీవ్రవాది షాహీద్ లతీఫ్ (Shahid Latif) పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. బుధవారం పాక్‌లోని సియోల్‌కోట్‌లో గుర్తుతెలియని దుండగులు అతని తుపాకీతో కాల్చిచంపారు. పఠాన్ కోట్ దాడి అనంతరం షాహీద్ లతీఫ్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. పఠాన్ కోట్ దాడిని సియోల్‌కోట్ నుంచి నడిపించాడు. దాడి చేసేందుకు నలుగురు ఉగ్రవాదులను పంపించిన విషయం తెలిసిందే.


కాగా.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద 1994 నవంబర్‌లోనే లతీఫ్‌ను భారత్ అరెస్ట్ చేసింది. న్యాయస్థానాల ముందు నిలబెట్టగా అతడికి జైలుశిక్ష కూడా పడింది. జైలు జీవితం పూర్తయిన తర్వాత 2010లో వాఘా సరిహద్దు ద్వారా అతడిని పాకిస్తాన్‌కు పంపించేశారు. అంతేకాదు.. 1999లో ఇండియన్ ఎయిర్‌‌లైన్స్ విమానం హైజాకింగ్ ఘటనలో కూడా లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. 2010లో జైలు శిక్ష అనంతరం పాకిస్తాన్ వెళ్లాక మళ్లీ అతడు ఉగ్రవాదుల్లో కలిశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తెలిపింది. భారత ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో చేర్చిందని అన్నారు.

Updated Date - 2023-10-11T12:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising