ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Patna High Court : నితీశ్ కుమార్‌కు భారీ ఊరట

ABN, First Publish Date - 2023-08-01T16:24:13+05:30

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. కుల ప్రాతిపదికన (caste-based) సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం తోసిపుచ్చింది.

Nitish Kumar

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. కుల ప్రాతిపదికన (caste-based) సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం తోసిపుచ్చింది. దీంతో కుల ప్రాతిపదికన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించవచ్చు.

వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిరోధించాలని పిటిషనర్లు కోరారు. వీటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థసారథి ధర్మాసనం తెలిపింది. జూలై 7న రిజర్వు చేసిన తీర్పును మంగళవారం వెల్లడించింది.

బిహార్ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, 80 శాతం సర్వే పూర్తయిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కుటుంబాల గణన జనవరి 7న ప్రారంభమై, జనవరి 21న ముగిసిందని తెలిపింది. రెండో దశ సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమైందని తెలిపింది. ప్రజల కులం, వారి సాంఘిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ 2023 మే నెలలో పూర్తికావలసి ఉందని పేర్కొంది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఈ సర్వేను నిలిపేయాలని మే 4న తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. ఇది జనాభా లెక్కల సేకరణ మాదిరిగా ఉందని, ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది.

ఇదిలావుండగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఓ పిటిషనర్ తరపు న్యాయవాది దీను కుమార్ చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..

Karnataka : టీటీడీకి కర్ణాటక డెయిరీ ‘నందిని’ షాక్

Updated Date - 2023-08-01T16:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising