ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dhanbad: ఇంట్లోకి దూసుకెళ్లిన గ్లైడర్ విమానం...పైలట్, చిన్నారికి గాయాలు

ABN, First Publish Date - 2023-03-24T07:27:21+05:30

గ్లైడర్ విమానం ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో పైలట్, మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు....

Glider plane crashes
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ధన్‌బాద్ (జార్ఖండ్): గ్లైడర్ విమానం ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో పైలట్, మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు.జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌(Dhanbad) నగరంలో గ్లైడర్ విమానం ఇంటి గోడపైకి దూసుకెళ్లడంతో పైలట్(Pilot), చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గ్లైడర్ విమానంలో సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందని(glider plane crashes) రికార్డు అయిన వీడియోలో తేలింది. కోయలాంచల్ వైమానిక పర్యటన కోసం గ్లైడర్ విమానం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్లైడర్‌లో ఉన్న పైలట్‌, చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదానికి గురైన గ్లైడర్ విమానం బార్వద్దా ఎయిర్‌స్ట్రిప్ నుంచి బయలుదేరింది. విమానం అదుపు తప్పి బిర్సా ముండా పార్క్ సమీపంలోని నీలేష్ కుమార్ ఇంటి వద్ద పడిపోయింది.పోలీసులు హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-03-24T07:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising