ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: రామభక్తుల కలలను సాకారం చేసిన పీఎం: అమిత్‌షా

ABN, First Publish Date - 2023-05-06T17:07:08+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అయోధ్య రామమందిరం అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించారు. అయోధ్యలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో అయోధ్య రామమందిరం అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) ప్రస్తావించారు. అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరగాలనే ప్రజల కలలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేశారని బెళగవిలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా అన్నారు.

''బీజేపీ ఇక్కడి (కర్ణాటక) రైతుల కోసం పనిచేసింది. రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాం. కాంగ్రెస్ సావర్కర్‌ను అవమానించింది. బజరంగ్ బలిని అవమానించింది. కానీ అయోధ్యలో ఆలయ నిర్మాణం జరగాలన్న రామభక్తుల కలను ప్రధాని మోదీ సాకారం చేశారు'' అని అమిత్‌షా అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై ఎవరికీ నమ్మకం లేదని, త్రిపుర, అసోం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పీపుల్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను బీజేపీనే నిషేధించిందని గుర్తుచేశారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు పీఎఫ్ఐ నుంచి ప్రజలకు రక్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రజలకు బీజేపీ రేషన్ ఇచ్చిందని, మంచినీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించిందని, రాష్ట్రంలోని డబుల్ ఇజన్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-06T17:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising