ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: మధ్యప్రదేశ్‌ని కాంగ్రెస్ 'బీమారు రాజ్యం'గా మార్చింది: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-09-25T13:24:24+05:30

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress) పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా మధ్యప్రదేశ్(Madyapradesh) లోని భోపాల్(Bhopal) లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

భోపాల్:స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress) పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా మధ్యప్రదేశ్(Madyapradesh) లోని భోపాల్(Bhopal) లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన 'కార్యకర్త మహాకుంభ్'(Karyakarth Mahakumbh) లో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని బీమారు రాజ్యంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని యువత చురుగ్గా ఆలోచించి అవినీతీ, అక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించారని, రానున్న అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి మళ్లీ అదే గతి పట్టించాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ ని ఆశీర్వదించారని కోరారు. కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోతే.. బీజేపీ వచ్చాక సుమారు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని.. ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మహిళా బిల్లు(Women Reservations Bill)ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు.


తప్పకుండా అధికారంలోకి వస్తాం..

బీజేపీ నిర్వహించిన కార్యకర్త మహాకుంభ్ గురించి ఆయన మాట్లాడుతూ.. సభకు వచ్చిన జనం చూస్తుంటే బీజేపీ కార్యకర్తల సత్తా ఏంటో తెలుస్తోందని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ దేశానికి గుండె కాయఅని సరైన అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భోపాల్‌లోని జంబోరీ మైదాన్‌లో నిర్వహించిన 'కార్యకర్త మహాకుంభ్' బీజేపీ 'జన్ ఆశీర్వాద యాత్రల' అధికారిక ముగింపు సభగా నిలిచింది. గతంలో రాష్ట్రంలో నిర్వహించిన ఆరు పర్యటనల సందర్భంగా, మోడీ 22 జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలను కవర్ చేశారు. పేదరికం, దళితులు, గిరిజనులు తదితర అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు వంటి అంశాలను ఎత్తిచూపుతూ ఆయన ప్రసంగాలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని సాగాయి. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఛత్తీస్ ఘడ్(Chattisgarh) లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొని పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగించనున్నారు.

Updated Date - 2023-09-25T13:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising