Narendra Modi: జీ-20 విజయోత్సాహం..మోదీకి పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం
ABN, First Publish Date - 2023-09-13T21:12:24+05:30
జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారంనాడు ఘనస్వాగతం లభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి మోదీ రావడంతో ఆయనకు పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, మంత్రులు సాదర స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: జి-20 సదస్సు (G-20 summit)ను విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారంనాడు ఘనస్వాగతం లభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి మోదీ రావడంతో ఆయనకు పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, మంత్రులు సాదర స్వాగతం పలికారు. జి-20 సక్సెస్ తర్వాత పార్టీ కార్యాలయానికి మోదీ రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఎన్‌సీఆర్ నుంచి వేలాది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య పార్టీ కార్యాలయానికి ప్రధాని చేరుకున్నారు.
బీజేపీ సీఈసీ సమావేశం ఎజెండా..
ఈ ఏడాది చివర్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ సీఈసీలో ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. నవంబర్-డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు లాస్ట్ రౌండ్‌గా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
Updated Date - 2023-09-13T21:12:24+05:30 IST