Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
ABN, First Publish Date - 2023-05-29T08:50:51+05:30
ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది....
గువహటి (అసోం): ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది.(Vande Bharat Express)ఈశాన్య ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణంలో ఆనందాన్ని పొందేందుకు తీసుకున్న చర్యలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అస్సాంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేశారని ప్రభుత్వ అధికారి తెలిపారు.(Northeast First Vande Bharat Express) అత్యాధునిక వందేభారత్ రైలును ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.(PM Modi Launch) బొంగైగావ్-దుద్నోయి-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.
ఇది కూడా చదవండి : Turkey election: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం
గౌహతి -న్యూ జల్పాయిగురి మధ్య 411 కి.మీ దూర రైలు ప్రయాణం 5 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన రైలు.దీని ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. అత్యంత వేగవంతమైన రైలు ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తోంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఒక్కొక్కటి 52 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.
Updated Date - 2023-05-29T08:50:51+05:30 IST