Modi: మన్ కీ బాత్ షోలో అక్షయ్ కుమార్‌ను మెచ్చుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Dec 31 , 2023 | 02:30 PM
ప్రధాని నరేంద్ర మోదీ(modi) బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) గురించి ప్రస్తావించారు. 56 ఏళ్ల వయస్సులో అతని మంచి ఫిట్ నెస్ ను కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా జరిగిన 108వ ఎపిసోడ్‌లో మాన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) గురించి ప్రస్తావించారు. అంతేకాదు అతను పాటిస్తున్న ఫిట్‌నెస్ విధానాలు, అతని ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటిస్తున్న పద్ధతులను గుర్తు చేశారు. జిమ్ చేయడం, ఈత కొట్టడం, బ్మాడ్మింటన్ ఆడటం, మెట్లు ఎక్కడం సహా పలు రకాల వ్యాయామాలు చేయడం అతని దినచర్యలో భాగంగా ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో అతన్ని మెచ్చుకుంటూ.. శ్రోతలు కూడా అతని ఫిట్‌నెస్ విధానాలను పాటించాలని సూచించారు.
56 ఏళ్ల వయస్సులో కూడా తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్ (fitness) విధానం గురించి ఓ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ పెంచుకునే నేపథ్యంలో షార్ట్‌కర్ట్ మార్గాలను అవలంభించకూడదని సూచించారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ పెంచడం కోసం స్టెరాయిడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. వాటిని ఉపయోగించడం ద్వారా శరీరంలో వెంటనే మార్పులు వచ్చినా కూడా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం(food) తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు నెయ్యి తింటే అనేక మంది ఫ్యాట్ పెరుగుతుందనే బ్రమలో ఉన్నారని గుర్తుచేశారు. స్వచ్ఛమైన నెయ్యి పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ అనేది ఇన్‌స్టంట్ కాఫీ కాదని రెండు మూడు నిమిషాల్లో చేస్తే వచ్చేది కాదని స్పష్టం చేశారు.
Updated Date - Dec 31 , 2023 | 02:31 PM