ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit : ‘వసుధైక కుటుంబం’ కల సాకారానికి కృషి : మోదీ

ABN, First Publish Date - 2023-09-10T16:05:33+05:30

దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Narendra Modi

న్యూఢిల్లీ : దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్లోబల్ విలేజ్ భావనకు అతీతంగా గ్లోబల్ ఫ్యామిలీ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం కృషి జరగాలన్నారు.

జీ20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌‌‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. దీనిపై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, స్వయం సమృద్ధ భారత్‌కు చిహ్నం ఖాదీ అని తెలిపారు. ఖాదీ మన సంస్కృతిలో భాగమని చెప్పారు. నేడు ఖాదీని విదేశీ అతిథులకు బహుమతిగా ఇవ్వడం మన దేశానికి గర్వకారణమని తెలిపారు. ఖాదీ పట్ల మోదీ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఖాదీ జాకెట్, కుర్తా పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారన్నారు. మోదీ జాకెట్ చాలా మంచి పేరు తెచ్చుకుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తుల అమ్మకాలు రూ.1.35 లక్షల కోట్లు దాటినట్లు తెలిపారు. ఈ పరిశ్రమ దాదాపు 9.45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. రానున్న కాలంలో ఈ రికార్డులను అధిగమిస్తాని తెలిపారు.

ఒడిశాలోని చిరుధాన్యాల బ్రాండ్ అంబాసిడర్ సుభాష మెహతా మాట్లాడుతూ, జీ20 అతిథులను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కలిశానని చెప్పారు. తనను టీవీలో చూసిన మయూర్‌భంజ్ ప్రజలు చాలా సంతోషించారన్నారు. తాము కూడా ఇదే విధంగా చేస్తామని, చిరు ధాన్యాలను పండించడానికి సహకరిస్తామని చెప్పారన్నారు. దీనివల్ల మయూర్‌భంజ్, ఒడిశాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?

CID On NCBN Remand Report : చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏయే విషయాలు చెప్పింది.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్ క్లూజివ్

Updated Date - 2023-09-10T16:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising