UNSC : ఐక్య రాజ్య సమితికి మోదీ సూటి ప్రశ్న
ABN, First Publish Date - 2023-07-13T13:14:48+05:30
భారత దేశానికి తగిన గౌరవం దక్కాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని నొక్కి వక్కాణించారు. ఇది కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అని చెప్పారు.
న్యూఢిల్లీ : భారత దేశానికి తగిన గౌరవం దక్కాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని నొక్కి వక్కాణించారు. ఇది కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అని చెప్పారు. ఫ్రెంచ్ పబ్లికేషన్ లెస్ ఎకోస్ (Les Echos)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ అంశం కేవలం విశ్వసనీయతకు సంబంధించినది మాత్రమే కాదు, మరింత విస్తృతమైనది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని అత్యధిక జనాభాగల దేశం, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం శాశ్వత సభ్యురాలు కానపుడు తాను ప్రపంచం కోసం మాట్లాడుతున్నానని ఆ మండలి ఏ విధంగా చెప్పుకోగలుగుతుంది?’’ అని ప్రశ్నించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా లేని వ్యవస్థకు సరైన ఉదాహరణగా భద్రతా మండలి నిలుస్తోందన్నారు.
పక్షపాతంతో కూడిన సభ్యత్వం పారదర్శకత లేని నిర్ణయీకరణ ప్రక్రియలకు దారి తీస్తోందన్నారు. నేటి సవాళ్ల పరిష్కారంలో నిస్సహాయతకు ఇది తోడవుతోందన్నారు. భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? భారత దేశం ఎలాంటి పాత్ర పోషించాలి? అనే అంశాలపై అత్యధిక దేశాలకు స్పష్టత ఉందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ (President Emmanuel Macron) కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు.
ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగే బాస్టిల్లే డే సెలబ్రేషన్స్ (Bastille Day celebrations)కు గౌరవ అతిథిగా మోదీ హాజరవుతారు. ఫ్రాన్స్‌కు బయల్దేరడానికి ముందు ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..
Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు
Updated Date - 2023-07-13T13:14:48+05:30 IST