Chandrayaan-3: దక్షిణాఫ్రికా నుంచే చంద్రయాన్-3 వర్చువల్ ప్రోగ్రాంలో మోదీ
ABN, First Publish Date - 2023-08-22T20:32:05+05:30
ఇస్రో ప్రకటించినట్టుగా ఈనెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాల కోసం యావద్దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 15వ బ్రిక్స్ సదస్సు-2023లో పాల్గొనేందుకు మంగళవారంనాడు దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సౌతాఫ్రికా నుంచే ''చంద్రయాన్-3'' వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గోనున్నారు.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించినట్టుగా ఈనెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాల కోసం యావద్దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 15వ బ్రిక్స్ సదస్సు-2023లో పాల్గొనేందుకు మంగళవారంనాడు దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సౌతాఫ్రికా నుంచే ''చంద్రయాన్-3'' వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గోనున్నారు.
విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే ఉత్కంఠ భరిత క్షణాలను ప్రజలంతా తిలకించేందుకు 'ఇస్రో' అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉద్విగ్నభరిత సన్నివేశాలను ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టవలసి ఉంది. ల్యాండర్, రోవర్ ప్రస్తుతం చంద్రుని ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలో తిరుగుతున్నాయి. చంద్రయాన్-3 విజయవంతమైతే జాబిల్లిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత దేశం చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొదటి దేశంగా కూడా ఘనత సాధిస్తుంది.
Updated Date - 2023-08-22T20:32:21+05:30 IST