ISRO : ఇస్రోపై మోదీ ప్రశంసలు
ABN, First Publish Date - 2023-03-26T19:37:39+05:30
భారత దేశపు అతి పెద్ద లాంచ్ వెహికిల్ మార్క్-3 (LVM3) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
న్యూఢిల్లీ : భారత దేశపు అతి పెద్ద లాంచ్ వెహికిల్ మార్క్-3 (LVM3) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), ఇతర పబ్లిక్ స్పేస్ ఏజెన్సీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రశంసించారు. స్వయం సమృద్ధ భారత దేశం యొక్క నిజమైన స్ఫూర్తితో గ్లోబల్ కమర్షియల్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత దేశపు పాత్రను ఈ విజయం మరింత బలోపేతం చేసిందన్నారు.
ఎల్‌వీఎం3 మూడు దశల రాకెట్. దీనిలోని మొదటి రెండు దశలకు ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. మూడో దశకు క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఉపయోగించారు. దీని ద్వారా 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందజేయడం లక్ష్యంగా వీటిని ప్రయోగించారు. వన్‌వెబ్ (OneWeb)లో మన దేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారు.
ఇవి కూడా చదవండి :
Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?
Updated Date - 2023-03-26T19:37:39+05:30 IST