ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Narendra Modi: ప్రధాని మోదీ మళ్లీ అదే పాత చింతకాయ పచ్చడి.. కాంగ్రెస్ స్కామ్‌ల మీద స్కామ్‌లు చేసిందంటూ..

ABN, First Publish Date - 2023-10-12T22:32:53+05:30

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల గురించి అందరికీ తెలిసిందేగా! మైక్ పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ అది చేసింది, ఇది చేసిందంటూ ఒకటే సైరన్ మోగించేస్తారు. తమ హయాంలో జరుగుతున్న ఘోరాలు..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల గురించి అందరికీ తెలిసిందేగా! మైక్ పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ అది చేసింది, ఇది చేసిందంటూ ఒకటే సైరన్ మోగించేస్తారు. తమ హయాంలో జరుగుతున్న ఘోరాలు, ఇతర తప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. తమ హయాంలో జరిగిన ఒక మంచి గురించి పదే పదే డప్పు కొట్టుకుంటూ.. కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేశారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.


లోక్‌సభ, అసెంబ్లీలో మహిళల కోసం 33 శాతం సీట్లను రిజర్వ్‌ చేసే పనిని తమ బీజేపీ ప్రభుత్వం చేసిందని మోదీ అన్నారు. ఈ పని గత 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, కానీ తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఈ పని చేసి చూపించిందని పేర్కొన్నారు. ఇంతకుముందు పేదరికాన్ని తొలగిస్తామని కాంగ్రెస్ నినాదం చేసిందని.. కానీ మనమంతా కలిసి పేదరికాన్ని నిర్మూలిద్దామని ఈ మోదీ చెప్తున్నాడని చెప్పారు. మనమంతా బాధ్యతగా, మనస్ఫూర్తిగా ఈ పని చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కుంభకోణాలు జరగకూడదని ప్రజలు దేవాలయాల్లో ప్రార్థనలు చేసేవారని.. కానీ కాంగ్రెస్ మాత్రం మోసాలను మానుకోలేదని ఆరోపించారు. స్కామ్ తర్వాత స్కామ్ చేసుకుంటూ పోయిందని వ్యాఖ్యానించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే దశాబ్దాల డిమాండ్ బీజేపీ ప్రభుత్వమే నెరవేర్చిందని వెల్లడించారు.

సరిహద్దు గ్రామాలను దేశంలో చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామంగా అభివృద్ధి చేయడం ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఇలాంటి సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తలచుకొని ఉంటే ఈ పని చేసేవని.. కానీ శత్రువులు దీనిని అనుకూలంగా మార్చుకొని దేశంలోకి వస్తారన్న భయంతో సరిహద్దు ప్రాంతాల్ని పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వాల ఈ భయానక ఆలోచనను వెనక్కు నెట్టేసి.. నేటి నవభావరం ముందుకు సాగుతోందన్నారు. ఈ రోజు భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు దూసుకుపోతోందని.. నేడు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నారని చెప్పారు.

Updated Date - 2023-10-12T22:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising