ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Danish Ali Letter to Modi: ప్రధాని మౌనం దేనికి సంకేతం?... బీఎస్‌పీ ఎంపీ ఆవేదన

ABN, First Publish Date - 2023-09-29T20:52:26+05:30

లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం విచారకరమని బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డేనిష్ అలీ శుక్రవారంనాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఎనిమిది రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

నూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi) మౌనం వహించడం విచారకరమని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ డేనిష్ అలీ (Danish Ali) శుక్రవారంనాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఎనిమిది రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను సభ్యుడిగా ఉన్న లోక్‌సభకే చెందిన ప్రధానమంత్రికి ఒక లేఖ కూడా రాశానని, ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన ఈ ఘటనను ఖండించాల్సిందిగా కోరానని చెప్పారు. అయినప్పటికీ ప్రధాన పెదవి విప్పక పోవడం విచారకరమని అని డేనిష్ అలీ అన్నారు.


''జి-20 విజయంతో యావద్దేశం మీ వెంట ఉంది. బాపూ (మహాత్మాగాంధీ) దేశంలో లించింగ్ ఘటనలపై మీరు ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పార్లమెంటరీ ప్రవర్తనావళికి ఇంతకంటే అగౌరవం ఏముంటుంది?'' అని డేనిష్ అలీ ప్రశ్నించారు. అనుచిత ప్రవర్తనకు పాల్పడిన బీజేపీ ఎంపీని సభ నుంచి బహిష్కరించాలని, లీగల్ చర్యలకు ఆదేశించాలని ఆయన కోరారు.


పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డానిష్ అలీపై లోక్‌సభలో రమేష్ బిధూడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిదూఢీపై చర్యలకు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బిధూడీ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా సైతం రికార్డుల నుంచి తొలగించి, ఇలాంటి ప్రవర్తన పునరావృతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయనను హెచ్చరించారు. అయితే, ఈ విషయంపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో లోక్‌సభ సభ్యత్వం నుంచి వైదొలగుతానని డేనిష్ అలీ అల్టిమేటం ఇచ్చారు. బీజేపీ సైతం రమేష్ బిధూడీ చేసిని అభ్యంతకర వ్యాఖ్యలపై ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది.

Updated Date - 2023-09-29T20:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising