ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pazha Nedumaran: ప్రభాకరన్‌ బతికే ఉన్నాడన్న ఈ పెద్దాయన పరిస్థితి ఇప్పుడేంటంటే..

ABN, First Publish Date - 2023-02-15T08:39:46+05:30

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌(Prabhakaran) బతికేవున్నాడని, ఆయన కుటుంబీకులతో తాను టచ్‌లో వున్నానంటూ ప్రకటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పళనెడుమారన్‏కు టైగర్ ఉచ్చు!

- విచారించేందుకు దర్యాప్తు సంస్థల సన్నాహాలు

చెన్నై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌(Prabhakaran) బతికేవున్నాడని, ఆయన కుటుంబీకులతో తాను టచ్‌లో వున్నానంటూ ప్రకటించిన తమిళ జాతీయోద్యమ నేత పళనెడుమారన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిషేధిత సంస్థకు చెందిన ప్రభాకరన్‌ కుటుంబీకులతో నెడుమారన్‌కు వున్న సంబంధాలపై ఆరా తీయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయి. ఆ మేరకు ఆయా సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. అందరూ చనిపోయినట్లుగా భావిస్తున్న ప్రభాకరన్‌ ఇప్పటికీ సజీవంగా వున్నాడని, త్వరలోనే ఆయన ప్రజల్లోకి రానున్నాడంటూ పళనెడుమారన్‌ సోమవారం తంజావూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో యావత్ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రకటనను శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌, ఎండీఎంకే అధినేత వైగో, కమ్యూనిస్టు పార్టీల నేతలు సైతం ఈ ప్రకటనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెడుమారన్‌ చేసిన ప్రకటన ఆధారంగా ప్రభాకరన్‌కు సంబంధించిన సమాచారం సేకరించాలనికేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. అదే సమయంలో తమిళనాడు(Tamil Nadu) క్యూబ్రాంచ్‌ పోలీసులు ఈ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. తమిళనాడు దర్యాప్తు విభాగ అడిషనల్‌ డీజీపీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదం, ఐజీ సెంథిల్‌ వేలన్‌, క్యూబ్రాంచ్‌ ఎస్పీ కన్నమ్మాళ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం.. మళ్లీ విచారణ జరిపేందుకు రంగంలోకి దిగింది. ప్రభాకరన్‌ మృతిని ధ్రువీకరిస్తూ గతంలో సేకరించిన వివరాలు, పత్రాలకు సంబంధించిన రికార్డులను దుమ్ము దులుపుతున్నారు. నిజానికి నిషేధిత ఎల్టీటీఈతో రాష్ట్రంలోని పలువురు నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఈ విషయంపై ఆ నేతలెక్కడా బయటపడలేదు. కానీ పళనెడుమారన్‌ మాత్రం ప్రభాకరన్‌ భార్య, కుమార్తె తనతో టచ్‌లో వున్నారని, వారి సూచనల మేరకే తానీ ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చేసిన ప్రకటన పైనా, ప్రభాకరన్‌ సతీమణి, కుమార్తె ఆచూకీ కోసం ఆరా తీయాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

పళనెడుమారన్‌ ప్రకటనపై విస్మయం!

పళనెడుమారన్‌ ప్రకటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 13 ఏళ్లక్రితం కన్నుమూసినట్లుగా చెబుతున్న ప్రభాకరన్‌.. సజీవంగా వున్నాడంటూ ఆయన ఏ ఆధారంతో ప్రకటన చేశారని ఎల్టీటీఈ సానుభూతిపరులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెడుమారన్‌ కన్నా వైగోకే ఎల్టీటీఈ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన సైతం ప్రభాకరన్‌ వ్యవహారంపై నోరు మెదపడంలేదు. అదే విధంగా ఎల్టీటీఈకి సన్నిహితుడిగా పేరుగాంచిన ‘నాం తమిళర్‌ కట్చి’ సీమాన్‌ సైతం నెడుమారన్‌ ప్రకటన తప్పు పట్టారు. ప్రభాకరన్‌ బతికుంటే పిరికివాడిలా తలదాచుకునేవాడు కాదని, లంక తమిళులపై జరుగుతున్న ఆగడాలను ఇంతకాలం సహించేవాడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే నెడుమారన్‌ ప్రకటనపై పలు అనుమానాలు రేగుతున్నాయని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు.

ఇదికూడా చదవండి: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Updated Date - 2023-02-15T09:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising